నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తోందన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే తన కెరీర్ లో మొదటిసారి ఐటమ్ గర్ల్ గా నటించింది. పుష్పలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరం చూసాం. ఈ సాంగ్ కోసం సమంత పెట్టిన ఎఫర్ట్స్ వింటే ఎవరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు.
ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సమంత మరోసారి ఐటమ్ సాంగ్ కు ఊ చెప్పిందన్న వార్త హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న చిత్రం లైగర్. ఈ సినిమాలో పూరి ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడట. ఈ సాంగ్ కోసం సమంతను అప్రోచ్ అవ్వగా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది.
Recent Random Post: