నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వందకు పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు రెండు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అఖండ సినిమా థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ లో కూడా సందడి చేస్తోంది.
అఖండ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీ ప్రేక్షకులు కూడా అఖండ సినిమా ను చూడాలని కోరుకుంటున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతూ తెలియజేస్తున్నారు. అఖండ సినిమా హిందీ వెర్షన్ ను తీసుకు రావాలి లేదంటే హిందీలో అఖండ ను రీమేక్ అయినా చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో మంచి విజయాలను దక్కించుకుంటున్నారు. పుష్ప ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పుష్ప హిందీ వర్షన్ దాదాపుగా 80 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. హిందీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా థియేటర్ల ద్వారా ఇంకా వసూళ్లను పుష్ప దక్కించుకుంటున్నాడు. కనుక పుష్ప సినిమా తరహాలోనే అఖండ సినిమాను కూడా హిందీలో విడుదల చేయాలని కొందరు కోరుతున్నారు.
అఖండ ను డబ్బింగ్ చేసి థియేటర్ రిలీజ్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తే మరి కొందరు మాత్రం ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ ను అయినా హాట్ స్టార్ వారు హిందీ ప్రేక్షకుల కోసం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హిందీ ప్రేక్షకులు ఈమద్య కాలంలో తెలుగు సినిమాలకు ఎంతగా అడిక్ట్ అయ్యారు అనేది వారు అఖండ గురించి చేస్తున్న ట్వీట్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
అఖండ సినిమా ను బాలయ్య తో బోయపాటి శ్రీను చేసిన విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించాడు. బాలయ్య ద్విపాత్రాభినయం లో కనిపించిన అఖండ హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు.
కాని ప్రస్తుతం తెలుగు సినిమాలు అంటే అంటే చాలు హిందీ ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక అఖండ సినిమా హిందీ వర్షన్ ను తీసుకు వస్తే తప్పకుండా మంచి లాభం దక్కుతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేమేం తప్పు చేశాం మాకు కావాలి అఖండ సినిమా అంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్న హిందీ ప్రేక్షకుల కోసం అఖండ మేకర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది చూడాలి.
Recent Random Post: