మేకింగ్ ఆఫ్ డిజె టిల్లు: ఈ శ్రమ టైమింగ్ ఫలిస్తుందిలే!

ఎంత కష్టపడినా అంతిమంగా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. హిట్టును నమ్మే పరిశ్రమలో ఒక్క హిట్టు ఎంతో ఊపు తెస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక హిట్టు కొట్టాలన్న తపనతో ఉన్నాడు డీజే టిల్లు. టైటిల్ కి తగ్గట్టే టిల్లు హాస్యం ఛమత్కారం అంతా ఇంతా కాదు. ప్రతి ఫ్రేమ్ లోనూ సిద్ధు లోని ఫన్ ఎలిమెంట్ ఎక్స్ ప్రెషన్ డైలాగ్ ప్రతిదీ అద్భుతంగా వర్కవుటయ్యాయని ఇప్పటికే విడుదలైన విజువల్స్ వెల్లడించాయి. తాజాగా డిజే టిల్లు మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఈ మూవీ కోసం టీమ్ ఎంతగా కమిట్ మెంట్ తో శ్రమించిందో అర్థమవుతోంది. సితార అధినేత ఎంతో కేర్ ఫుల్ గా దగ్గరుండి మరీ ఈ మూవీని హిట్టు కొట్టేట్టు చేస్తున్నారని అర్థమవుతోంది.

సిద్ధు `డీజే టిల్లు`గా ఇప్పటికే యూత్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమాతో అతడి రేంజు మారిపోతుందన్న అంచనా ఏర్పడింది. ఇక మూవీ ఉపశీర్షిక ఆసక్తిని కలిగిస్తోంది. `అట్లుంటది మనతోని` అనేది ఈ సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి హీరోయిన్. ఈ బ్యూటీ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా వాయిదా వేసారు. తాజాగా ఫిబ్రవరి 12న థియేటర్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

థియేట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఫిలింస్ దక్కిచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇందులో ప్రిన్స్ సిసిల్..ప్రగతి..నర్రా శ్రీనివాస్..బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Recent Random Post: