చిరంజీవి టైటిల్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ

టైటిల్స్ పరంగా టాలీవుడ్ లో చాలా హీరోల మధ్య క్లాష్ ఎదురైన విషయం తెలిసిందే. ఓ స్టార్ హీరో సినిమాకు అనుకున్న టైటిల్ ని మరో హీరో డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ గ్రాబ్ చేయడం.. ఆ తరువాత ఇద్దరి మధ్య చర్చలు జరగడం.. అనుకూలంగా వుంటే టైటిల్ ఇచ్చేసేవారు కానీ చాలా వరకు అలా జరగలేదు. ఒకరి సినిమాకు యాప్ట్ అని ఫిక్స్ చేసుకుని మీడియాకు రిలీజ్ చేయకుండానే మరో హీరో సినిమాకు అదే టైటిల్ ని ఫిక్స్ చేసి రిలీజ్ చేసిన సందర్భాలు చాలానే వున్నాయి.

గత కొన్నేళ్లుగా ఈ రచ్చ ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోలకు తలనొప్పులుగా మారుతూ వస్తోంది. మహేష్ ఖలేజా కల్యాణ్ రామ్ కత్తి నాని గ్యాంగ్ లీడర్ గీతా ఆర్స్ట్ `అర్జున్` ఎన్టీఆర్ కోసం చేసిన `రచ్చ`.. సంపత్ నంది `గాడ్ ఫాదర్` .. ఇలా చేతులు మారాయి. అయితే మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ విషయంలో మాత్రం ఇందకు భిన్నంగా జరిగినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. `సైరా నరసింహారెడ్డి` తరువాత మునుపెన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇప్పటికే ఇందులో `ఆచార్య` చిత్రీకరణ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీతో పాటు మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీతో పాటు తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా `భోళా శంకర్` మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ .. మెగాస్టార్ కు చెల్లెలుగా నటిస్తున్న ఈ మూవీని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించిన ఈ మూవీలో చిరంజీవి మాసీవ్ అవతార్ లో గళ్ల లుంగీ కట్టుకుని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇప్పటి వరకు చిరుపై ఐదు రోజుల పాటు చిత్రీరణ జరిపారు. ఆ తరువాత మిగతా తారగణంపై పలు కోర్టు సన్నివేశాలని రూపొందించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గత కొన్ని రోజులుగా `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ వినిపిస్తోంది.

ఇదే పేరుకు దగ్గరగా `వాల్తేరు శ్రీను` పేరుతో సుమంత్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. అయితే ఈ విషయం తెలిసి చిరు టీమ్ వారిని టైటిల్ మార్చుకోమని సంప్రదించారట. అందుకు అంగీకరించిన సదరు మూవీ టీమ్ తమ సినిమా టైటిల్ ని `అనగనగా ఒక రౌడీ` గా మార్చుకున్నారట. దీంతో చిరు – బాబీ సినిమా టైటిల్ ని `వాల్తేరు వీరయ్య`గా మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరు ప్రస్తుతం వరుస షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సహా వెకేషన్ కి మాల్దీవులకు వెళుతున్నట్టుగా తెలిసింది. తిరిగి వచ్చాక అంటే మార్చిలో `వాల్తేరు వీరయ్య` కీలక ఘట్టాల చిత్రీకరణ మొదలు కానుందని చెబుతున్నారు.


Recent Random Post: