ఈగో .. తెలుగులో రెండు అక్షరాలే అయినా .. ఇది చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. దాని ఎఫెక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు ‘ఈగో’ అంటే ఏమిటి? అనుకుంటే ‘మనకి ఉండవచ్చుగానీ ఎదుటివారికి ఉండకూడదు’ అనుకునేది అనే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు .. పేరు ‘ఈగో’ను కాపాడుకునే కవచాలుగా కనిపిస్తాయి. ఈ రెండూ లేకపోతే అది పుట్టదు .. పెరగదు. ఆ రెండు లేని వాళ్ల దగ్గర అది ఉందామనుకున్నా చెల్లదు. కనుక ఈ రెండూ ఉండి కూడా ‘ఈగో’ లేనివాళ్లనే గొప్పవాళ్లుగా చెప్పుకోవాలి.
ఇదిగో అలాంటి గొప్పవాళ్ల జాబితాలోనే మన మహేశ్ బాబు పేరు స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఈగో’ ఉన్నవారు తమకంటే గొప్పవారు ఉన్నారనే విషయాన్ని అంగీకరించరు. అలాంటివారిపై ఆధారపడి బ్రతికేవారు ఆ నిజాన్ని చెప్పలేరు. అందువలన చాలామంది తమ ‘ఈగో’పై ఈగను కూడా వాలనీయరు. కానీ అలాంటి ఈగోకి మహేశ్ బాబు చాలా దూరం అనే విషయం ఆయన చేసే పనుల వలన తెలుస్తోంది. ‘ఈగో’ను పక్కన పెట్టడం వల్లనే మహేశ్ బాబు అంత హ్యాండ్సమ్ గా కనిపించడానికి కారణమనే వారు లేకపోలేదు.
మహేశ్ బాబు తన సినిమాలు తాను చేసుకుపోతాడు. సెట్లో ఆయన సెటైర్లు వేస్తాడు .. అది కూడా సెట్ లో సీరియస్ వాతావరణం లేకుండా చేయడం కోసమే. కొత్త ఆర్టిస్టులలో తన పట్ల భయమనేది లేకుండా చేయడం కోసమే. సెట్లో నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన ఎవరిని గురించి ఎక్కడా విమర్శించిన దాఖలాలు కనిపించవు. కొత్తగా వచ్చిన ఇతర హీరోల సినిమాలు కూడా ఆయన చూస్తుంటాడు. తనకి నచ్చకపోతే ఆ సినిమాను తాను చూసినట్టుగా కూడా చెప్పరు. నచ్చితే మాత్రం ఆ సినిమా టీమ్ ను అభినందిస్తూ ట్వీట్ చేస్తాడు.
తన సమకాలీన హీరోలను అభినందించడానికీ .. వారి ప్రత్యేకతలను గురించి ప్రస్తావించడానికి .. శుభాకాంక్షలు తెలియజేయడానికి ధైర్యం కావాలి. మంచి మనసు ఉన్నవారికే అంతటి ధైర్యం ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన ‘భీమ్లా నాయక్’పై కూడా మహేశ్ బాబు తన స్పందనను తెలియజేశాడు.
పవన్ తో పాటు ఈ సినిమా టీమ్ కి కంగ్రాట్స్ చెప్పాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. ఈ కారణంగానే అందరి హీరోల అభిమానులు మహేశ్ బాబును అభిమానిస్తుంటారని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో కృష్ణకి మల్లెపువ్వులాంటి మనిషి అనే పేరు ఉంది. ఆయన వారసుడికి ఆ మాత్రం మంచి మనసు రావడంలో ఆశ్చర్యం ఏముంటుంది?
Recent Random Post: