‘రాధేశ్యామ్’ విషయంలో ఆ మ్యాజిక్ మిస్సయిందా?

కొన్ని సినిమాలకు జరిగే హడావిడి వల్ల అసలు విషయం పక్కదారి పట్టేస్తుంటుంది. అలా జరగడం వల్ల వెండితెరపై భారీ స్కేల్ లో మ్యాజిక్ చేస్తాయని భావించిన చిత్రాలు ఆ మ్యాజిక్ ని చేయలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఇది చాలా చిత్రాల విషయంలో జరిగింది. అలాంటి మిస్టేక్ ‘రాధేశ్యామ్’ విషయంలోనూ జరిగిందని కామెంట్ లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ విజువల్ వండర్ ‘రాధేశ్యామ్’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రారంభ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది.

మార్చి 11న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా స్లోగా వుందని కొంత మంది చెబుతుంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరపైకి వచ్చిన ఈ మూవీలో ఆ ఫీల్ కనిపించడం లేదని చాలా మంది చెప్పుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముందు అనుకున్న ప్రకారం ఈమూవీ నిడివి చాలా పెద్దది. అయితే అంత నిడివి ఎందుకని మేకర్స్ ఫైనల్ కట్ కి వచ్చేసరికి ట్రిమ్ చేసేశారు.

అదే ఈ మూవీకి పెద్ద డ్రా బ్యాక్ గా మారిందని కొంత మంది చెప్పుకుంటున్నారు. డెస్టినీ వర్సెస్ లవ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే రిలీజ్ తరువాత డెస్టినీతో హీరో పోరాడే సన్నివేశాలని సీన్ లని చూపించారే కానీ ప్రేమకు సంబంధించిన బలమైన సన్నివేశాలని మాత్రం సినిమాలో చూపించలేకపోయారని. అవి చూపించి వుంటే తన ప్రేమ కోసం హీరో విధితో ఫైట్ చేసిన విధానాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవారని ఆడియన్స్ కూడా హీరో హీరోయిన్ ల పెయిన్ ని ఫీలయ్యేవారని ప్రస్తుతం ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోందట.

సినిమా నిడివి తగ్గించడం వల్ల ఫీల్ కనిపించకపోగా.. సినిమా ఏ సన్నివేశాలతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచి మ్యాజిక్ చేస్తాయని మేకర్స్ భావించారో ఆ మ్యాజిక్ కనిపించలేదని చివరి నిమిషంలో ఎడిటింగ్ టేబుల్ పై కూర్చుని హడావిడిగా చేసిన మార్పులు సినిమాకు బలంగా మారకపోగా అవే డ్రా బ్యాక్ గా మారాయని ప్రచారం జరుగుతోంది. ముందు అనుకున్న వెర్షన్ ని అలాగే వుంచి ఎలాంటి కట్స్ లేకుండా రిలీజ్ చేస్తే బాగుండేదని అందుకే మేకర్స్ అనుకున్న మ్యాజిక్ సినిమాలో మిస్సయిందని ఆడియన్స్ చర్చిస్తున్నారట.

చివరి నిమిషంలో ఎడిట్ చేసి కీలక సన్నివేశాలని తొలగించడంతో ప్రేక్షకులకు సినిమా ఆశించిన స్థాయి ఫీల్ ని కలిగించలేకపోయిందని అదే ఇప్పుడు సినిమాకు ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారట.

అంతే కాకుండా కీలక జోడీ ప్రభాస్ – పూజాల మధ్య వచ్చే కీలక ఎపిసోడ్ లని కూడా ట్రిమ్మింగ్ పేరుతో టీమ్ చివరి నిమిషంలో లేపేయడం జగపతిబాబు రిద్దికుమార్ లకు సంబంధించిన సన్నివేశాల్లో ఎక్కువ భాగం కట్ చేయడం సినిమాకు ప్రధాన సమస్యగా మారిందని అందు వల్లే ‘రాధేశ్యామ్’ మ్యాజిక్ చేయలేకపోయిందని చెబుతున్నారట.


Recent Random Post: