పవన్ సినిమా తర్వాత చిరంజీవితో..!

మెగాస్టార్ చిరంజీవి కమిట్ అవుతున్న సినిమాల జాబితా చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తుంది. ఆచార్య సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వం లో చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్‌ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అది కాకుండా ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వం లో చిరంజీవి ఒక సినిమా కు ఒకే చెప్పారు. బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న అనే సినిమా ఇప్పటికే మొదలు పెట్టాడు.

మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే పుకార్లు షికార్లు చేశాయి. ఇన్ని సినిమాలు చేస్తున్న చిరంజీవి తాజాగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నా హరీష్‌ ఆయనతో భవదీయుడు భగత్‌ సింగ్ సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో హరీశ్ శంకర్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది ఒక రీమేక్ సినిమా అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.


Recent Random Post: