ప్రభాస్ అనుష్క శెట్టి.. టాలీవుడ్లో ఈ జోడీకి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `బిల్లా`లో తొలిసారి జతకట్టిన ఈ జంట.. ఆ తర్వాత మిర్చి బాహుబలి సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రభాస్ అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. కానీ.. ప్రభాస్ అనుష్కలు మాత్రం ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు.
తమ మధ్య మంచి స్నేహ బంధమే ఉందని.. అంతకు మించి ఏమీ లేదని అనేక సార్లు వీరు వెల్లడించారు. ఇకపోతే బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంటే.. అనుష్క మాత్రం అరకొర సినిమాలు మాత్రమే చేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. వీరిద్దరూ మరోసారి వెండతెరపై జతకట్టబోతున్నారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ ఇటీవల మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నారట. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే కాగా.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు అలరించబోతున్నారు.
అయితే అందులో ఒక హీరోయిన్గా అనుష్కను సెలెక్ట్ చేసి.. తాజాగా ఆమెను సంప్రదించారట. తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటం సినిమా లైన్ కూడా బాగుండటంతో.. అనుష్క ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే ప్రభాస్ అనుష్కల అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` ఓం రౌత్ డైరెక్షన్లో `ఆదిపురుష్` నాగ్ అశ్విన్‌తో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సలార్ ప్రాజెక్ట్-కె సెట్స్ మీదే ఉన్నాయి. ఇవి పూర్తైన అనంతరం సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` స్టార్ట్ చేయనున్నాడు. ఆపై మారుతి సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
Recent Random Post: