ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. వరల్డ్ వైడ్ `ఆర్ఆర్ఆర్` వసూళ్ల ప్రభంజనం కనిపిస్తోంది. ఇక ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం విశేషం. అక్కడ మొదట అంత ఊపు కనిపించకపోయినా నెమ్మదిగా అక్కడా వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో `ఆర్ఆర్ఆర్` వండర్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదటి రోజే తెలంగాణలో `బాహుబలి` వసూళ్ల రికార్డులని చెరిపేసింది. అటుపై సీడెడ్ ..ఆంధ్రాలోనూ `ఆర్ ఆర్ ఆర్` సత్తా చాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్` ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఓ కొత్త రికార్డుని సృష్టిస్తోంది. దీంతో `బాహుబలి ది బిగినింగ్` వసూళ్లు క్రాక్ అయినట్లు తెలుస్తోంది. `బాహుబలి` మొదటి భాగం ఫుల్ రన్ లో 600 కోట్ల వసూళ్లను సాధించగా `ఆర్ ఆర్ ఆర్` కేవలం ఎనిమిది రోజుల్లోనే ఆ రికార్డుని తిరగ రాసింది.
ట్రేండ్ పండితులు అంచనా వేసినట్లు `బాహుబలి` వసూళ్లు క్రాక్ అవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. రాజమౌళి.. నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మూవ్ మెంట్ ని చరణ్ ఇంకా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగానే సినిమాకి వివిధ విభాగాల్లో పనిచేసిన వారందర్నీ చరణ్ పిలిపించి బహుమతులు అందజేసినట్లు తెలుస్తోంది. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించారు. వారందరికీ చరణ్ ఊహించని బహుమతులు అందించి సర్ ప్రైజ్ చేసారు.
సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను.. కెమెరా అసిస్టెంట్లను.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్లను.. మేనేజర్లను.. అకౌంటెంట్లను.. స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం చరణ్ పిలిపించారు. వారితో చరణ్ కొంత సమయం మాటమంతి చేసారు. అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ తో పాటు కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించారు. సినిమా కోసం పని చేసినందుకు చరణ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతంగా రావడంలో వారి పాత్ర ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
బ్యాకెండ్ లో పనిచేసిన వారి ప్రతిభని గుర్తించి ఇలా ప్రోత్సహించడం అన్నది చాలా రేర్. ఆ విషయంలో చరణ్ గ్రేట్ అనే చెప్పాలి. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు దర్శకులు చేయాలి. కానీ టాలీవుడ్ ఈ విధమైన కల్చర్ లేదు. కేవలం కొంత మంది హీరోలే ఇలాంటి బాధ్యతలు తీసుకుంటారు. ఒక సినిమాకి రేయింబవళ్లు ఎంతో మంది శ్రమిస్తారు. వాళ్లంతా కష్టపడితేనే బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేది. హీరోలు తయారయ్యేది. నిర్మాతలు నాలుగు రాళ్లు వెనకేసుకునేది. నవతరం..నటులు..దర్శకులు ఆవిర్భావం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చరణ్ బహుకరించిన వాళ్లలో ఎవరో ఒకరు చరణ్ నే డైరెక్ట్ చేసే స్థాయికి రావొచ్చు. అదే ఇండస్ర్టీ లెక్క.
Recent Random Post: