తన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో రక్తి కట్టించడంలో దర్శకదిగ్గజం శంకర్ తర్వాతే. అతడు తెరకెక్కించిన చాలా చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బ్లాక్ బస్టర్లుగానే నిలిచాయి. సినిమా విజయంలో అవి కీలక పాత్రను పోషించాయి. జెంటిల్ మేన్- భారతీయుడు – అపరిచితుడు లాంటి చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషన్ ని రగిలిస్తాయి. థియేటర్లలో ఆడియెన్ కి పూనకాలు పుట్టిస్తాయి. అందుకే అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని ఎంపిక చేసుకున్నాడు అంటే అందులో సంథింగ్ ఉంటుందని ఆడియెన్ అంచనాకి వస్తారు.
ఇప్పుడు #RC15 లోనూ అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందని తాజాగా లీకైన చరణ్ లుక్ చెబుతోంది. రామ్ చరణ్- కియారా అద్వానీ కథానాయికలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. RRR తర్వాత ఆచార్య రిలీజవుతుండగా.. చరణ్ వడి వడిగా శంకర్ తో సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. RC15 పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఇప్పటికే కథానాలొచ్చాయి.
ఐఏఎస్ టర్న్ డ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని కూడా టాక్ వచ్చింది. తాజాగా సెట్స్ నుండి లీకైన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇందులో చరణ్ పూర్తి పల్లెటూరి కుర్రాడి అవతార్ లో కనిపిస్తాడని ఈ ఫోటో చెబుతోంది. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరి రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడనడానికి కూడా ఈ లుక్ సాక్ష్యంగా నిలవనుంది.
అతను సాంప్రదాయ పంచె కట్టు వేషధారణలో కనిపిస్తున్నాడు. పక్క పాపిడి చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్ లో హ్యాండ్ మడత పెట్టి సైకిల్ పై అలా వెళుతున్నాడు. భుజాలపై కండువాతో కోర మీసాలతో కనిపిస్తున్నాడు. రంగస్థలం చిట్టి బాబులా ఎంతో సహజంగా కనిపిస్తున్నాడు. ద్విపాత్రాభినయం చేయడం అనేది ఏ నటుడికైనా ఉత్తమమైన ప్రదర్శనకు ఆస్కారం కల్పిస్తుంది. చరణ్ కి అలాంటి అరుదైన అవకాశం కలిగిందని అర్థమవుతోంది.
డబుల్ రోల్ నిజంగానే చరణ్ కి బిగ్ సవాల్ లాంటిది. దానిని వైవిధ్యంగా ప్రదర్శించడంలో శంకర్ తనదైన శైలిని కలిగి ఉన్నారు. చరణ్ లాంటి పెర్ఫామర్ డెడికేషన్ ఉన్న హీరోతో అది అతడికి సులువు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్.ఆర్.ఆర్ లో డిఫరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్న చరణ్ వెనువెంటనే ఆర్.సి 15 లోనూ వైవిధ్యమైన గెటప్స్ తో అలరించనున్నాడు.
ఇది నిజంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక పాత్రల ఆహార్యం పరంగా వైవిధ్యం ప్రదర్శించడంలో చరణ్ తన ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించాల్సి ఉంటుంది. ఆర్.సి 15కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్ద ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
Recent Random Post: