కెరీర్ పరంగా మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘ఆచార్య’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న ఆయన.. మరోవైపు అరడజన్ కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేశారు. అందులో ‘మెగా 154’ ఒకటి.
యంగ్ డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం అవుతోంది. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి తమ్ముడిగా రవితేజ నటిస్తున్నారని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. కానీ ఈ విషయాన్ని మేకర్స్ ఇంతవరకు కన్ఫార్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
వాస్తవానికి ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచీ టైటిల్ ఏమై ఉంటుందా అని మెగా అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరన్న మాస్ మూల విరాట్ ఇలా పలు టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ చిత్ర టీమ్ మాత్రం టైటిల్ ను రివిల్ చేయకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ‘మెగా 154’ టైటిల్ ను లీక్ చేసేశారు.
అసలేం జరిగిందంటే.. శేఖర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయన్ను యాంకర్ మీ అప్ కమ్మింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటూ ప్రశ్నించాడు. అందుకు శేఖర్ మాస్టర్ బదులిస్తూ.. ‘ రవితేజగారు నటిస్తున్న ధమాకా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాను తమళంలో రెండు ప్రాజెక్ట్ లు అలాగే చిరంజీవిగారితో భోళా శంకర్ వాల్తేరు వీరయ్య చిత్రాలు చేస్తున్నా ‘ అంటూ నోరు జారారు. దీంతో మెగా 154 టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని కన్ఫార్మ్ అయిపోయింది.
ఏదైనా స్పెషల్ డే నాడు టైటిల్ ప్రకటన చేద్దామని మేకర్స్ ఇన్నాళ్లు వెయిట్ చేశారు. కానీ ఊహించని విధంగా శేఖర్ మాస్టర్ టైటిల్ లీక్ చేయడంతో.. మేకర్స్ తీవ్ర అసహనంలో ఉన్నారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. కాగా గతంలో ‘ఆచార్య’ టైటిల్ కూడా ఇలానే లీక్ అయింది. అయితే అప్పుడు చిరునే స్వయంగా ఓ సినిమా ఫంక్షన్ లో పొరపాటున ఆచార్య టైటిల్ ను లీక్ చేశారు.
Recent Random Post: