అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ హీరోగా బన్నీకి మంచి మార్కులు పడ్డాయి. సుకుమార్ మరియు రష్మిక మందన్నాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు.
పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలో కనిపించిన సునీల్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ లో ఆ పాత్ర గురించి.. ఆ పాత్రలో నటించిన సునీల్ గురించి జనాలు బాగా మాట్లాడుకున్నారు.
దాంతో ఇప్పుడు హిందీలో సునీల్ కు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఒకటి రెండు సార్లు సునీల్ కు హిందీ ఆఫర్లు వచ్చాయట కాని అవి చిన్న చితకా సినిమాలు అవ్వడంతో ఆసక్తి చూపించలేదు.
ఈసారి మాత్రం సునీల్ కు ఒక మంచి నిర్మాణ సంస్థ వారు తాము స్టార్ హీరోతో నిర్మించబోతున్న సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కమెడియన్ పాత్ర కోసం కాకుండా విలన్ పాత్ర కోసం వారు సునీల్ సంప్రదించారని తెలుస్తోంది. బాలీవుడ్ లో మన స్టార్ లు ఈమద్య నటించడం చాలా కామన్ అయ్యింది. ఇప్పుడు సునీల్ కూడా ఎంట్రీకి సిద్దం అయ్యాడు.
సునీల్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అయ్యింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో సునీల్ మొదటగా కమెడియన్ గా సినిమాలు చేశాడు. ఆ తర్వాత అందాల రాముడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అయిదు ఆరు సంవత్సరాల పాటు బిజీగా సినిమాలు చేశాడు. కాని కాలం కలిసి రాక పోవడంతో సునీల్ వరుసగా ప్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆయన మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు సెకండ్ హీరోగా లేదా మెయిన్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే పుష్ప కారణంగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు రావడం.. తద్వారా బాలీవుడ్ నుండి పిలుపు రావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో సునీల్ ఇప్పటికే చేయాల్సిందని… ఇప్పటికైనా సునీల్ కు బాలీవుడ్ ఛాన్స్ రావడం ఆనందం
Recent Random Post: