తమిళ హీరోతో గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్

తెలుగులో స్టార్ హీరోలు క్రేజీ స్టార్స్ మునుపెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడు పెంచేశారు. గతంలో ఏడాదికి ఒకటి అర సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మన స్టార్స్ ఇప్పడు కరోనా కారణంగా ఏర్పడిన రెండేళ్ల గ్యాప్ ని దృష్టిలో పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వరుస పెట్టి చేసేస్తున్నారు. ఒక్కో హీరో మూడు నుంచి నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రొడక్షన్ కంపనీలు కూడా భారీగానే సినిమాల నిర్మాణం పెంచేశారు. ఒక్కో ప్రొడక్షన్ కంపనీ మూడు నుంచి నాలుగు సినిమాలు నిర్మిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాయి.

ఇక మన వాళ్లు పాన్ ఇండియా మూవీస్ పై గురి పెట్టడంతో యావత్ దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూడటం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు కూడా మన టాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. పాన్ ఇండియా మూవీస్ తరువాత ముందు పక్కన వున్న టాలీవుడ్ మార్కెట్ లో పసాగా వేయాల్సిందే అంటూ బై లింగ్వల్ మూవీస్ కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే క్రేజీ స్టార్ లు ధనుష్ విజయ్ శివకార్తికేయన్ వంటి హీరోలు బైలింగ్వల్ సినిమాతో తెలుగులో పాగా వేయడానికి రెడీ అయిపోతున్నారు.

ముందుగా ఈ ఫార్ములా సినిమాలకు శ్రీకారం చుట్టింది ధనుష్. ధనుష్ తొలిసారి తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ‘సార్’ చిత్రాన్ని చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య నిర్మాతలుగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. గత కొంత కాలంగా తెలుగులో సినిమా చేయాలని ఎదురుచూసిన ధనుష్ ‘సార్’తో తన కోరికని నెరవేర్చుకుంటున్నాడు.

ఇక దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ భారీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దళపతి66 మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ బైలింగ్వల్ మూవీగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో హీరో కార్తి కూడా చేరబోతున్నారు. ప్రస్తుతం విరుమన్ సర్దార్ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ లో నటిస్తున్న కార్తి తొలిసారి బైలింగ్వల్ మూవీ చేయబోతున్నాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని తెలిసింది. దీనికి దర్శకుడు ఎవరు? ..ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది? .. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటీ? వంటి విషయాల్ని త్వరలోనే గీతా ఆర్ట్స్ వర్గాలు అధికారికంగా వెల్లడించనున్నారట.


Recent Random Post: