పెళ్లి రూమర్లపై రామ్ రియాక్షన్..!


`ఇస్మార్ట్ శంకర్` మూవీతో మాసీవ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న హీరో రామ్ మళ్లీ అదే తరహా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని స్టార్ హీరోగా మళ్లీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో హై వోల్టేజ్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా `ది వారియర్` మూవీ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే నెల రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దీంతో ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర బృందం ప్రారంభించింది. రామ్ కూడా చురుగ్గా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. చాలా రోజుల తరువాత తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై హీరో రామ్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఇదిలా వుంటే ఉస్తాద్ రామ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తూ వైరల్ గా మారింది. తన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ ని రామ్ వివాహం చేసుకోబోతున్నారని ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోందని వార్తలొచ్చాయి.

ఆలనోట ఈ నోట పాకడంతో చివరికి పెళ్లి వార్తలు రామ్ దాకా చేరాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రామ్ తనపై వస్తున్న పెళ్లి వార్తలని తీవ్రంగా ఖండిచాడు. సోషల్ మీడియా వేదికగా హీరో రామ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. `ఓరి దేవుడా.. ఆపండి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నేను నా స్కూల్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నాను అను రూమర్లు ఇంటి వరకు చేరాయి.

వారికి కూడా అవన్నీ గాలివార్తలే అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పట్లో ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కి కూడా వెళ్లేవాడిని కాదు.

`అంటూ రామ్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. రామ్ స్పందించిన తీరు చూస్తుంటే పెళ్లి వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అయినట్టుగా కనిపిస్తోంది. దీని ప్రభావం రామ్ పై చాలా ప్రభావాన్ని చూపించినట్టుగా తెలుస్తోంది. అందుకే రామ్ ఈ రేంజ్ లో స్పందించి రూమల్ లకు చెక్ పెట్టాడు.

అయితే పెళ్లి రూమర్లపై అయితే స్ట్రాంగ్ గానే స్పందించాడు కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పకుండా తప్పించుకున్నాడని పెళ్లి ఎప్పుడు; ఎవరితో వుంటుందో కూడా క్లారిటీ ఇస్తే బాగుండేది కదా అని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే రామ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని జూలై 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే ఇంటర్నేట్ ని షేక్ చేస్తున్నాయి.


Recent Random Post: