షారుక్ కోసం నయన్ అంత డిమాండ్ చేసిందా?


దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ నాయిక నయనతార. స్టార్ హీరోల స్థాయిలో నేమ్ తో పాటు ఫేమ్ ని సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గానూ దక్షిణాదిలో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. గత ఐడదేళ్లుగా యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో వున్న నయనతార ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో జూన్ 9న కోరుకున్న వాడినే పెళ్లాడింది.

నయనతార – విఘ్నేష్ శివన్ ల వివాహం జూన్ 9న కుటుంబ సభ్యులు బంధు మిత్రులు కోలీవుడ్ స్టార్ల మధ్య మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు. తమిళ సెలబ్రిటీలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఇక పెళ్లి తరువాత తిరుమల దేవస్థానంలో ప్రత్యక్షమైన ఈ జంట వివాదంలో చిక్కుకుని ఆ తరువాత క్షమాపలు చెప్పడం తెలిసిందే.

ఇదిలా వుంటే వివాహం తరువాత కూడా నయనతార సినిమాల్లో కంటిన్యూ కానుందట. అయితే ఆమె కొన్ని కండీషన్ లకు లోబడి మాత్రమే సినిమాల్లో నటించడానికి అంగీకరిస్తోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి తరువాత నయనతార బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వబోతోంది.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ ‘జవాన్’ పేరుతో ఓ భారీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ ని కూడా విడుదల చేసి ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేశారు.

ఈ మూవీ ద్వారానే నయనతార బాలీవుడ్ బాట పడుతోంది. షారుక్ కు జోడీగా ఈ మూవీలో నయనతార కనిపించబోతోంది. ఆ కారణంగానే షారుక్ ..నయన పెళ్లికి హాజరయ్యారట. ఇక భారీ స్థాయిలో హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ మూవీ కోసం నయనతార భారీగానే డిమాండ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ కోసం నయనతార ఏకంగా 8 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. తన డిమాండ్ మేరకు మేకర్స్ అంత మొత్తం ఇచ్చేశారని తెలుస్తోంది. ఇటీవల పెళ్లి తరువాత భర్త విఘ్నేష్ తో కలిసి హనీమూన్ వెళ్లిన నయనతార తిరగి చెన్నై చేరుకుంది. రీసెంట్ గానే ‘జవాన్’ మూవీ కోసం ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది.


Recent Random Post: