RRR డిజిటల్ రైట్స్.. జక్కన్నా.. మజాకా!

తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ స్థాయిలో తెరపైకి వచ్చిన RRR సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక దర్శకధీరుడు రాజమౌళి చాలా తెలివిగా చేసిన ప్రమోషన్స్ కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్య అయినప్పటికీ కూడా బిజినెస్ డీటెయిల్స్ వ్యవహారాలలో మాత్రం రాజమౌళి నిర్ణయమే కీలకమని అర్థమవుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా ఆలోచించారనే చెప్పాలి. సినిమాకు కేవలం ప్రాఫిట్స్ అందించడమే కాకుండా వీలైనంత ఎక్కువగా జనాలకు దగ్గరవ్వాలి అని అలా జరిగితే భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అని జక్కన్న ఆలోచించిన విధానం గ్రేట్ అని చెప్పవచ్చు. ఇంకా RRR సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

ఒక విధంగా ఆ సంస్థకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. దీంతో రాజమౌళి తదుపరి సినిమాకు ఓవర్సీస్ బిజినెస్ కు ఇది మంచి ఉపయోగపరంగా కూడా ఉంటుంది. అయితే రాజమౌళి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ కు అమ్మడం జరిగింది. ఇక సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ హక్కులను మాత్రం జి5 సంస్థకు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా మరొక డీల్ మాట్లాడుకుని తెలుగు మలయాళం కన్నడ మలయాళం భాషలలో కూడా విడుదల చేయనున్నారు.

జి ఫైవ్ తో ముందుగా చేసుకున్న ఒప్పందం లో కొంత మార్పులు చేసి మళ్లీ ఇప్పుడు డిస్నీ ప్లేట్స్ హాట్ స్టార్ ద్వారా మరికొంత లాభాన్ని అందుకొని ఆ సంస్థకు అమ్మివేసినట్లు సమాచారం. అంటే మొత్తంగా ఇప్పుడు సినిమా మూడు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో సందడి చేయబోతోంది. ఒక విధంగా ఈ రూట్లో కూడా RRR సినిమా రికార్డు క్రియేట్ చేసింది.


Recent Random Post: