భారీ అంచనాలు పెట్టుకున్న ‘లైగర్’ డిజాస్టర్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వెయిటింగ్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత వెంటనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఈ మూవీకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశకాలు వున్నట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా దిల్ రాజు .. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడు.
ఈ నేపథ్యంలో విజయ్ కి తగ్గ కథ కోసం దిల్ రాజు గత కొంత కాలంగా చాలా మంది దర్శకులతో చర్చిస్తున్నాడట. ఆ దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా వున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మోస్ట్ లీ విజయ్ దేవరకొండ – దిల్ రాజు ప్రాజెక్ట్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడో చిక్కుంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వబోతోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ ఫలితాన్ని బట్టే విజయ్ దేవరకొండ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం వుంది.
హిట్ అనిపించుకుంటే ముందు కెళతారు.. లేదంటే విజయ్ దేవరకొండ మళ్లీ రిస్క్ చేయడానికి ఆసక్తిని చూపించడం కష్టమే. ‘లైగర్’తో భారీ షాక్ కు గురైన విజయ్ దేవరకొండ తెలిసి తెలిసి మళ్లీ అదే తప్పు చేయడానికి ఇష్టపడడు అన్నది క్లియర్. అందుకే తను మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడట. ఇదిలా వుంటే విజయ్ తో ప్రాజెక్ట్ మిస్సయితే ఇంద్రగంటి మోహనకృష్ణ కు ముగ్గురు స్టార్ లు అందుబాటులో వున్నారట.
మంచి కథతో రమ్మని మహేష్ బాబు వైఫ్ నమ్రత ఇప్పటికే ఇంద్రగంటికి చెప్పారట. తనకు తగ్గ కథ కోసం కూడా ఇంద్రగంటి సెర్చ్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతే కాకుండా నాగచైతన్యతోనూ సినిమా చేయాలనే ప్రయత్రాల్లో వున్నారట. గతంలో ఓ స్టోరీ వినిపిస్తే అది పెద్దగా చైతూకు నచ్చలేదని అయితే మంచి కథ కుదిరితే తప్పకుండా కలిసి చేయాలని అనుకున్నారట. దీంతో చైని ఇంప్రెస్ చేసే కథ కోసం ఇంద్రగంటి వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్లే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంద్రగంటితో సినిమా చేయాలనుకుంటున్నారట.
ఇవన్నీ పక్కన పెడితే సమంత కారణంగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషీ’ రెగ్యులర్ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తదుపరి షెడ్యూల్ కు సామ్ అందు బాటులో లేదని తెలిసింది. దీంతో ఈ మూవీ తాజా షెడ్యూల్ విషయంలో సందిగ్థత కొనసాగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ మాత్రం ఈ మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని డేట్ ని ప్రకటించేశారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ డేట్ మారే అవకాశం వుందని తెలుస్తోంది.
Recent Random Post: