‘బ్రహ్మాస్త్ర’లో పాత్రలపై నెటిజనుల బిగ్ డిబేట్


షారుఖ్ ఖాన్ పాత్ర చనిపోయిందా? గురూజీ విలన్ కదా?’ బ్రహ్మాస్త్ర అభిమానుల సిద్ధాంతాలు మీరు చూడలేదు రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ వన్- సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదలైంది. విడుదలై 5 రోజులు అయ్యింది. రిలీజ్ డే నుంచి సోషల్ మీడియాల్లో బోలెడంత డిబేట్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫోటోలు వీడియోలతో వెబ్ నిండిపోయింది. సినిమా పాత్రలు – ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి అభిమానుల సిద్ధాంతాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ సిద్ధాంతాల వెనుక ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ అర్థం కావడం లేదు. అవి చదివేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి.. పునరాలోచించేలా చేస్తున్నాయి.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ‘శివ’ అనే సాధారణ వ్యక్తి పాత్రను పోషించగా అలియా భట్ అతని ప్రేమికురాలు ఇషాగా నటించింది. అయితే నెటిజనులు ఆలియా పాత్రను అంతవరకే పరిమితం చేయలేదు. చాలా మంది అభిమానులు ఇషా పాత్రలో కంటికి కనిపించని దానికంటే ఎక్కువ సంగతులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దేవ్ ధరించిన లోహపు ఉంగరాన్ని ఇషా ధరించడాన్ని కొందరు డేగ కళ్ల అభిమానులు గమనించారు. తద్వారా ఇషా నిజమైన విలన్ కావచ్చు..

తనకంటూ ఒక సొంత గేమ్ ప్లాన్ కలిగి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. అంతే కాదు! అమితాబ్ బచ్చన్ పాత్ర గురూజీ ప్రధాన విలన్ ఎలా కావచ్చో చెబుతున్నారు. షారుఖ్ ఖాన్ పాత్ర మోహన్ సజీవంగా ఉండవచ్చని కూడా అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి.

నా సిద్ధాంతం గురు ప్రధాన విలన్. దేవ్ ఒక రకమైన యాంటీ హీరో కావచ్చు. అమృత తిరిగి రాకపోవడానికి ఇది కారణం కావచ్చు అని ఒక ట్విట్టరాటీ రాసాడు. వానరాస్త్రం అతని నుండి తీసుకున్న తర్వాత కూడా SRK జునూన్ స్పెల్ ను విచ్ఛిన్నం చేయగలడు.

అతను బహుశా సహజంగా దైవం తీరుగా ఉంటాడని .. అతనికి ఇతర శక్తులు కూడా ఉన్నాయని ఇది చూపిస్తుంది. అందువల్ల అతను బాల్కనీ నుండి పడిపోయినా కానీ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’పై ఇలాంటి వందలాది సిద్ధాంతాలు వెబ్ ని ముంచెత్తుతున్నాయి. ఈ చర్చ చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు బ్రహ్మాస్త్ర ఫేక్ కలెక్షన్ల గురించి కూడా అంతే ఇదిగా వెబ్ లో చర్చ వేడెక్కిస్తోంది.


Recent Random Post: