టీం ఇండియాకు ఎంతమంది కెప్టెన్స్ ఉన్నా.. ఇంకా ఎంతోమంది కెప్టెన్స్ వచ్చినా సరే కెప్టెన్ గా సౌరభ్ గంగూలి అంటే అదో రెస్పెక్ట్. 2000 తర్వాత జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న దాదా ప్రతి సీరీస్.. ప్రతి గెలుపుపై తన ముద్ర వేశారు. టీం ఇండియా పర్ఫెక్ట్ కెప్టెన్ అని చెప్పుకుంటే ముందు సౌరభ్ గురించే చెప్పుకోవాలి. అలాంటి సౌరభ్ గంగూలి బయోపిక్ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. సౌరభ్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పంధించాడు రణ్ బీర్. సౌరభ్ గంగూలి బయోపిక్ లో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఇంతవరకు తనని ఎవరు సంప్రదించలేదని అన్నారు రణ్ బీర్ కపూర్.
దాదా బయోపిక్ అంటే వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరికి సౌరభ్ గంగూలి ప్రస్థానం గురించి తెలుసు. కాబట్టి ఆయన జీవిత కథ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాల్సిందే. ఇదే విషయాన్ని రణ్ బీర్ కూడా చెప్పారు. దాదాపు ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన జీవిత కథ సినిమాగా తీస్తే చాలా బాగుంటుందని అన్నారు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ బయోపిక్ లో ఎవరు నటిస్తారన్నది త్వరలో తెలుస్తుంది.
ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రణ్ బీర్ కపూర్ సంజయ్ దత్ బయోపిక్ లో నటించాడు. ప్రస్తుతం లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ కి సైన్ చేసినట్టు తెలుస్తుంది. స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలను తెర మీద చూపిస్తే వారి అభిమానులు కూడా వావ్ అనేస్తున్నారు. ఈ క్రమంలోనే మిల్కా సింగ్ ఎమ్మెస్ ధోని బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ గా హిట్ అయ్యాయి. అయితే అదే క్రమంలో మిథాలి రాజ్ సైనా నెహ్వాల్ బయోపిక్ లు నిరాశపరిచాయి. అందుకే క్రీడా దిగ్గజాల జీవిత కథలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
సౌరభ్ గంగూలి బయోపిక్ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దాదా పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది త్వరలో తెలుస్తుంది. రణ్ బీర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే తను సౌరభ్ బయోపిక్ లో నటించే ఛాన్స్ లేదని అర్ధమవుతుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.
Recent Random Post: