బాలీవుడ్ స్టార్ సింగర్ అద్నాన్ సమీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఎన్నో పాటలు పాడారు. వేలాది శ్రోతలు అతనితో గొంతు కలిపి ఉర్రూతలూగుతున్నారు. తెలుగులోనూ ఆయన గాత్రం ఎంతో మధురం. టెంపర్ లో ‘చూలేంగే ఆస్మా’…’జులాయి’ లో ఓ మధు ఓమధు వంటి ఎన్నో పాటలతో ఇక్కడి సంగీత ప్రియుల్ని అలరించారు. అయితే ఆయన ఎప్పుడు ఆలపించినా? కచ్చితంగా ఆయన భారీ శరీరం గురించి టాపిక్ వస్తుంది. ఇంతనేంటి? ఇంత లావు ఉన్నాడు? అని అంతా అతనిలో గాయకుడిని పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సద్నాన్ భాయ్ ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ హీరోలా సన్నని జువ్వలా తయరాయ్యాడు. 230 కేజీలు నుంచి 75 కేజీల బరువుకు లాగేసాడు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ జర్నీ గురించి అద్నాన్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
‘చిన్నతనం నుంచి బొద్దుగానే ఉండేవాణ్ని. విపరీతంగా తినేవాడిని. తిండి విషయంలో రాజీ అనే మాట నా డిక్షనరీలో లేదు. దీంతో మరింత లావుగా తయరాయ్యా. ఎక్కడ పడితే అక్కడే నిద్రపోయావాణ్ని. కారు కూడా ఎక్కలేకపోయే వాడిని. ఇలా ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కుంటున్నా నాలో మార్పు రాలేదు. తినడం ఆపలేదు. బ్రౌనీలను తెగ తినేవాడిని. రికార్డింగ్ రూమ్ లో ప్లేటు నిండా బ్రౌనీలు పెట్టమనేవాడిని. వాటిని పల్లీలు నిమిలినట్లు నమిలేవాడిని. అప్పటికే 200 కేజీలు ఉండేవాడిని.
అదే సమయంలో మోకాళ్లకు ఆపరేషన్ జరగడంతో ఇంట్లో ఉండి మరింతగా తినేవాడిని. మరో 30 కేజీలు పెరిగా. ఆ కారణంగా భార్య పిల్లలు దూరమయ్యారు. అప్పట్లో అమ్మ..నాన్నతో అమెరికాలో ఉండేవాడిని. ఆ సమయంలో డాక్టర్లు మీవాడు గుండెపోటుతో ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్పారు. ఏ తండ్రి అయినా కొడుకు చేతుల్లో అంతిమసంస్కారాలు చేయించుకోవాలనుకుంటాడు. కానీ నా పరిస్థితి వేరులా అయింది. దీంతో నాన్న ఎంతో బాధ పడ్డారు. అది తెలిసి నాన్న బరువు తగ్గించమని బ్రతిమలాడి ఏడ్చారు.
దీంతో కృతిమ పద్దితో తగ్గే మార్గం ఉన్నా సహజంగానే తగ్గాలని నిర్ణయించుకున్నా. కానీ నేను వ్యాయామం చేసినా గెండె పోటు రావొచ్చు. బాధలో ఉన్నా..సంతోషంగా ఉన్న అతిగా తినేవాడిని. అలా తినకపోతే డిప్రెషన్ లోకి వెళ్లేవాడిని. దీంతో ముందు నన్ను నేను నియంత్రిచుకున్నా. శరీరాన్ని చిన్నగా కష్టపెడుతూ మనసు చెప్పింది చేయాలనుకున్నా. డైటీషన్..న్యూట్రిషన్ కి కలిసా. డైట్ ప్రారంభ ముందురోజు తినాలనుకున్నవి అన్ని లాగించి..ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణం మొదలు పెట్టా.
డైలీ రొటీన్ తిండి మానేసా. ఉప్పు..నూనే లేని వంటకాలు మితంగా తీసుకున్నా. పరిగెత్తడం డాక్టర్లు ఆధ్వర్యంలో చేసా. ఇలా నెల రోజులు చేసే సరికి పది కిలోలు తగ్గా. దీంతో నమ్మకం ఏర్పడింది. అలా 16 నెలల్లో 130 కేజీలు తగ్గా. ఆ లుక్ చూసుకుని నన్ను నేనే నమ్మలేకపోయా. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.
Recent Random Post: