చైతన్యతో ఓకే ఒక్క ఫొటో.. నిహారిక సీక్రెట్ ఏంటి?

విడాకులు అంటే సాధారణ జనానికి పెద్ద విషయం కానీ సెలబ్రిటీలకు మాత్రం ఇన్ స్టా నుండి ఫోటోలు డిలీట్ చేసినంత కామన్. ప్రేమ పెళ్లి ఆ తర్వాత విడాకులు.. ఇవన్నీ చాలా సాధారణంగా వినిపించే పదాలు. ప్రేమలో పడటం డేటింగ్ చేయడం పెళ్లి చేసుకోవడం చిన్న చిన్న సమస్యలకే విడిపోవడం అలా చూస్తుండగానే జరిగిపోతూ ఉంటాయి సెలబ్రిటీల జీవితాల్లో.

మెగా డాటర్ నిహారిక విషయంలో కూడా ఇలాంటిదే జరిగినట్లు ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదు అని నిహారిక సన్నహితుల నుంచి వినిపించింది . మెగా డాటర్స్ ను విడాకులు వదిలి పెట్టడం లేదు. ఇప్పుడు ఆ లిస్టులోకి నాగబాబు కూతురు నిహారిక చేరిపోయినట్లు ప్రచారం జరిగింది . నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డలు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జోరుగా జరిగింది.

గత నెలలో చైతన్య తన ఇన్ స్టా అకౌంట్ నుండి నిహారికతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. నిహారికను అన్ ఫాలో కూడా చేసేశాడు. అలాగే నిహారిక కూడా ఫోటోలన్నీ డిలీట్ చేసి చైతన్యను అన్ ఫాలో కొట్టేసింది. అయితే చైతన్యతో ఉన్న ఒక్క ఫోటోను మాత్రం నిహారిక డిలీట్ చేయకుండా అలాగే ఉంచేసింది.

ఈ పిక్ లో నిహారికి చైతన్య పెళ్లి మండపంలో కూర్చొని ఉన్నారు. నిహారిక పక్కన చైతూ ఉన్నప్పటికీ కాస్తంత బ్లర్ చేసినట్లుగా కనిపిస్తుంది. ‘నా దగ్గర ఓ రహస్యం ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది.. సారీయే చెప్పలేను’ అనే క్యాప్షన్ తో గతంలో నిహారిక ఆ ఫోటోను పోస్టు చేసింది.

ఇది గమనించిన నెటిజన్లు నిహారిక ఆ ఒక్క ఫోటోనే డిలీట్ చేయకుండా ఉంచడంపై ఆరా తీస్తున్నారు. ఆ ఒక్క ఫోటోను ఎందుకు ఉంచావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మర్చిపోయావా లేదా కావాలనే అలా ఉంచేశావా అంటూ అడుగుతున్నారు. అయితే 2020 ఆగస్టులో నిహారిక చైతన్యల ఎంగేజ్మెంట్ జరిగింది. అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.


Recent Random Post: