అమ్మాయిలను వదలని హీరో.. అదే పని.. చివరకు షాకింగ్ ట్విస్ట్

అతడో హీరో.. అందమైన యువతులపై అత్యాచారం చేయడాన్నే పనిగా పెట్టుకున్నారు. పడుచు యువతులను ట్రాప్ చేయడం.. వారిపై అత్యాచారం చేయడాన్ని కంటిన్యూ చేశాడు. అయితే అతడి ఆగడాలు ఎంతో కాలం నిలవలేదు. పాపం పండింది. తాజాగా ఆ నటుడికి భారీ జైలు శిక్ష పడింది. శిక్ష విధించినప్పుడు మన హీరో సైలెంట్ అవ్వగా.. భార్య మాత్రం 30 ఏళ్ల శిక్షపడడంతో భోరుమని ఏడ్చేసింది.

అత్యాచారాల కేసులో దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్సన్కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముగ్గురు యువతులను అత్యాచారం చేశాడని అతనిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలు కోర్టులో రుజువయ్యాయి. మరో కేసు వీగిపోయింది. తనతో షోతో ఆకట్టుకున్న ఈ అమెరికన్ నటుడు శిక్షను ఎదుర్కొవాల్సి వస్తోంది.

డానీ మాస్టర్ సన్ 2001లో తనపై అత్యాచారం చేశాడంటూ 23 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. 2003లో 28 ఏళ్ల యువతిపై డానీ మాస్టర్ సన్ అత్యాచారానికి పాల్పడగా 2003 చివర్లో మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నటుడిపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి.

2020 జూన్లో ఈ కేసులపై విచారించిన న్యాయస్థానం డానీకి జైలు శిక్ష విధించింది. అయితే 3.3 మిలియన్ డాలర్లు చెల్లించిన డానీ అదేరోజు జైలు నుండి విడుదలయ్యాడు. తాజాగా మరోసారి విచారణను ఎదుర్కున్నాడు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు డానీ నేరస్తుడుగా పరిగణించింది.

దీంతో ఆయనకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2001 2003లో నమోదైన రెండు కేసుల్లో ఆయనకు ఈ శిక్ష విధించారు. 2003 చివర్లో ఓ యువతిని హాలీవుడ్ హిల్స్లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ ఒక్క కేసు వీగిపోయింది.

న్యాయస్థానం తీర్పు వెలువరించే సమయంలో డానీ మౌనంగా ఉండిపోయారు. ఆయన భార్య నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణ కారణంగా నెట్ఫ్లిక్స్ 2017లో ద రాంచ్ అనే కామెడీ షో నుండి డానీ మాస్టర్ సన్ను తొలగించిన సంగతి తెలిసిందే.

డానీ నాలుగేండ్ల వయస్సు నుండే చైల్డ్ మోడల్ గా ఉన్నాడు. ఆయనకు ఐదు సంవత్సరాలున్నప్పుడే అతని మోడలింగ్ గురించి మ్యాగజైన్లలో ఆసక్తికర కథనాలు వచ్చాయి. టీవీ యాడ్స్లోనూ నటించాడు.. తన ఎనిమిదో యేటా నటన ప్రారంభించిన డానీ 16 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు 100 యాడ్స్లో నటించాడు.

అమెరికాలో పాపులర్ అయిన దట్ సెవంటీస్ షోలో మొత్తం 8 సీజనల్లో నటించాడు. ఈ ప్రదర్శన ముగిసిన తర్వాత ఆయనకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. ఫ్యాన్స్ ఫాలొయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన్ను వెంటాడాయి.


Recent Random Post: