చనిపోయిన దొంగ బయోపిక్ ఆ సినిమా!?

2019 సంవత్సరంలో తిరుచినాపల్లి జిల్లా లో ఉన్న లలితా జ్యూవెలరీ షో రూమ్ లో దొంగతనం జరిగింది. తిరువరూర్ మురుగన్ అనే గజ దొంగ ఆ దొంగతనాని కి పాల్పడ్డాడు. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మరియు వజ్రాల ను అతడు లూటీ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.

తమిళనాడు పోలీసులు చాలా కష్టపడి తిరువరూర్ మురుగన్ ను పట్టుకున్నారు. కేవలం ఆ ఒక్క దొంగతనం మాత్రమే కాకుండా తమిళనాడు లో ఇంకా పలు దొంగతనాలు మరియు ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తన గ్యాంగ్ తో దొంగతనాల కు పాల్పడ్డ మురుగన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలు కు పంపించారు. అతడు 2020 సంవత్సరం లో ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందాడు.

ఇప్పుడు ఆ దొంగ కథ ను తీసుకుని తమిళంలో జపాన్ అనే సినిమా ను రూపొందిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కార్తీ హీరో గా అను ఇమాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా లో మురుగన్ కథ కు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి స్క్రీన్ ప్లేను నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మురుగన్ ఎందుకు దొంగగా మారాడు.. ఆ తర్వాత ఎలా దొంగతనాలు చేశాడు అనేది కథ గా చూపించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఈ సినిమా యొక్క క్లైమాక్స్ ను ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని కొందరు యూనిట్ సభ్యులు.. అలా అక్కర్లేదు పాజిటివ్ గా క్లైమాక్స్ ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జపాన్ సినిమా లో దొంగ పాత్రను హీరో గా చూపించబోతున్నారు. కనుక హీరో ను ఎయిడ్స్ తో చంపడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. కార్తీ సూచన తో క్లైమాక్స్ సహజత్వంతో ఉండాలని ప్లాన్ చేశారట. మొత్తానికి కార్తీ ఈ సినిమా లో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలాంటి పాత్రల్లో నటించాలి అంటే హీరోల కు ఘట్స్ ఉండాలి. మన తెలుగు హీరోల కు ఎప్పుడు కూడా ఇలాంటి ఘట్స్ ఉండవు. మనకు సుపరిచితుడు అయిన కార్తీ అయినా ఇలాంటి పాత్రతో సినిమా ను చేయాలి అనుకోవడం హర్షించదగ్గ విషయం అనే టాక్ వినిపిస్తుంది.

భారీ బడ్జెట్ తో విభిన్నంగా రూపొందుతున్న ఈ సినిమా ని తమిళం మరియు తెలుగు తో పాటు కాస్త అటు ఇటుగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కార్తీ కి తమిళం లో పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ లు దక్కాయి కానీ తెలుగు లో మాత్రం సక్సెస్ దక్కలేదు. మరి జపాన్ తో కార్తీ సక్సెస్ ను దక్కించుకునేనా చూడాలి.


Recent Random Post: