అడల్ట్ ఇండస్ట్రీని YRF ధర్మ ప్రొడక్షన్స్ తో పోల్చింది

శృంగార తార సన్నీలియోన్ లైఫ్- కెరీర్ జర్నీ గురించి అభిమానులకు పరిచయం అవసరం లేదు. ఆరంభం శృంగార రస చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అదే క్రమంలో తన గతం నుంచి బయటపడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింనని కూడా తెలిపింది. బాలీవుడ్ లో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని అంత మాత్రాన వాటినే తలుస్తూ జీవించనని కూడా సన్నీ వెల్లడించింది.

అడల్ట్ పరిశ్రమలో తన అనుభవాలను చాలాసార్లు రివీల్ చేసింది సన్నీ. తాజాగా మరోసారి ఆనాటి అనుభవాలను మీడియాకు షేర్ చేసింది. తాను అడల్ట్ ఇండస్ట్రీ సహా హిందీ చిత్రసీమలో ఉత్తమ కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నందుకు సన్నీ లియోన్ కృతజ్ఞతలు తెలిపింది.

అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ కి గేర్ మార్చేందుకు సాగించిన ప్రయాణం కేక్ వాక్ కాదని కూడా తెలిపింది. తొలినాళ్లలో బాలీవుడ్ లో చాలా శ్రమించాల్సొచ్చింది. ఇప్పుడు హిందీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని స్థిరపరుచుకుంది. తదుపరి ధర్మ ప్రొడక్షన్స్ – యష్ రాజ్ ఫిల్మ్స్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

సన్నీలియోన్ అడల్ట్ ఇండస్ట్రీలో ఉత్తమ కంపెనీలతో కలిసి పని చేసానని.. ఏదైనా సంతకం చేసే ముందు ఒప్పందాన్ని పూర్తిగా చదివేలా చూసుకున్నానని తెలిపింది. నా అడల్ట్ ఫిల్మ్ కెరీర్ లో అత్యుత్తమ భాగం ఏమిటంటే నేను బెస్ట్ కంపెనీలతో కలిసి పనిచేశాను.

నా ఉద్దేశ్యం ఉత్తమమైనప్పుడు నేను దానిని ఇక్కడి ధర్మా- యష్ రాజ్ ఫిలింస్ తో మాత్రమే పోల్చగలను. నేను ప్రతి ఒప్పందాన్ని చదివాను. తద్వారా నన్ను నియమించుకుంటున్న కంపెనీలు కోరుకున్నవి పొందాయి.. నేను కోరుకున్నది నేను పొందాను.. అని కూడా సన్నీ చెప్పింది.

అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను రెట్టింపు పనిని చేయవలసి వచ్చిందని సన్నీ లియోన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. కఠోర శ్రమతో వేగంగా పరిశ్రమలో ముందుకు సాగాలని సన్నీ భావించింది. ఒకటికి రెండు సార్లు తీవ్రంగా కష్టపడి పని చేసానని వెల్లడించింది. నిజానికి నేను తీసుకోవాలనుకున్న అడుగు అది కాదు. కానీ అది నా జీవితాంతం స్థిరపడింది. పరిశ్రమ ఏదైనా నేను ఎప్పుడూ రెండుమూడుసార్లు బ్రేక్ కోసం కష్టపడాల్సి వచ్చేది. నేను కోరుకున్న చోట అనుకున్నది సాధిస్తాను. కానీ దీనికి సమయం పడుతుంది. ఇప్పుడు కూడా” అని సన్నీ అంది.

సన్నీ లియోన్ ఇటీవలే 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ‘కెన్నెడీ’ చిత్రం కోసం బి-టౌన్ లోని అత్యుత్తమ దర్శకులలో ఒకరైన అనురాగ్ కశ్యప్ తో కలిసి పనిచేసింది. ఆమెకు జోడీగా రాహుల్ భట్ నటించాడు. కెన్నెడీ విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.


Recent Random Post: