స్టార్ హీరో బ‌ర్త్ డేలో 30 ఫోన్లు కొట్టేశారు

స్టార్ హీరో బ‌ర్త్ డే అంటే అభిమానుల సంద‌డి ఏ రేంజులో ఉంటుందో ఊహించ‌గ‌లిగేదే. గ్యాల‌రీ కిక్కిరిసిపోవ‌డం.. ఫ్లోర్ ద‌ద్ద‌రిల్లిపోవ‌డం గ్యారెంటీ. అస‌లే వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో జోరుమీదున్న కింగ్ ఖాన్ షారూఖ్ బ‌ర్త్ డే స‌మావేశం అంటే.. అభిమానుల సంద‌డి ఏ రేంజులో ఉంటుందో అంచ‌నా వేయ‌గ‌లం. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు రాత్రి ముంబైలోని ‘మన్నత్’ బంగ్లా వెలుపల భారీగా ఫ్యాన్స్ గుమిగూడారు. అక్కడ స్పెష‌ల్ బ‌ర్త్ డే శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అయితే ఈ రాత్రిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. వివ‌రాల్లోకి వెళితే..

కింగ్ ఖాన్ షారుఖ్ నవంబర్ 2 నాటికి 58 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ స్పెష‌ల్ నైట్ ప్రతి సంవత్సరం మాదిరిగానే భారీగా అభిమానుల సందోహం మన్నత్ వెలుపల గుమిగూడి ఖాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ తన అభిమానులతో ముచ్చటించి కృతజ్ఞతలు తెలిపారు. అయితే అక్క‌డ పోగైన గుంపు నుండి 30కి పైగా మొబైల్ ఫోన్లు దొంగ‌త‌నానికి గుర‌య్యాయ‌ని తెలిసింది. గుమిగూడిన వ్యక్తుల మొబైల్ ఫోన్‌లను దొంగ‌లు చాక‌చ‌క్యంగా దొంగిలించగలిగారు. దీనిపై ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కింగ్ ఖాన్ తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చిన‌ అభిమానుల‌కు కృతజ్ఞతలు తెలిపారు. “మీలో చాలా మంది ఇంత రాత్రివేళ‌ వచ్చి నాకు శుభాకాంక్ష‌లు చెప్పాల‌నుకోవ‌డం నమ్మశక్యం కాదు. నేను కేవలం నటుడిని మాత్రమే. నేను మిమ్మల్ని కొంచెం అలరించగలిగిన దానికంటే నాకు సంతోషం కలిగించేది ఏదీ లేదు. నేను మీ ప్రేమ అనే కలలో జీవిస్తున్నాను. మీ అందరినీ అలరించడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు.

షారుఖ్ తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన అభిమానుల కార్యక్రమానికి డుంకీ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, రచయిత అభిజత్ జోషి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో SRK తన త‌దుప‌రి చిత్రం డుంకీ గురించి మాట్లాడుతూనే చాలా విషయాలను చ‌ర్చించారు. చివ‌రిగా పఠాన్ -జవాన్ ల‌లో పాట‌ల్ని పాడారు ఖాన్. జూమే జో పఠాన్ .. నాట్ రామయ్య వస్తావయ్యా పాటలను ఆల‌పించి జోష్ ని ప్ర‌ద‌ర్శించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే…SRK చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ జవాన్‌లో కనిపించాడు. ఇది క‌మ‌ర్షియ‌ల్ గా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు డుంకీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను – విక్కీ కౌశల్ కూడా నటించారు. ఈ సంవత్సరం డిసెంబర్‌లో క్రిస్మస్ వారంలో డుంకీ థియేటర్లలో విడుదలవుతోంది.


Recent Random Post: