తమిళ్ సూపర్ విజయ్ రికార్డ్ లను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన సినిమాల కలెక్షన్స్, ఆయన యూట్యూబ్ రికార్డులను ఇతర స్టార్ హీరోలు బ్రేక్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. కానీ విజయ్ సాధించిన అరుదైన రికార్డు ను తమిళ స్టార్ హీరో బ్రేక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
అసలు విషయం ఏంటి అంటే ట్విట్టర్ లో అక్టోబర్ 26, 2023 న సూర్య తన 43వ సినిమా ప్రకటన వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోను ఏకంగా 26.5 మిలియన్ ల మంది చూశారు. ఒక సినిమా అనౌన్స్మెంట్ వీడియోను ఇంతగా చూడటం రికార్డ్. ఆల్ ఇండియా రికార్డ్ ను సూర్య 43 దక్కించుకుంది.
అంతకు ముందు ఆ రికార్డ్ ను డిసెంబర్ 2022 లో విజయ్ షేర్ చేసిన వీడియో కలిగి ఉంది. ఆ వీడియో 26.2 మిలియన్ల వ్యూస్ ను కలిగి ఉంది. ఆ రికార్డ్ ను నెల రోజులు తిరక్కుండానే సూర్య బ్రేక్ చేయడం నిజంగా పెద్ద విషయం అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత సుధ కొంగర దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక విజయ్ విషయానికి వస్తే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Recent Random Post: