గాన గాంధర్వుడు ఘంటసాల గురించి చెప్పేదేముంది. తెలుగు పాటను తేనెతో అభిషేకించిన గాయకుడు. ఎన్నో వేల పాటలు ఆయన స్వరం నుంచి జాలువారాయి. గాత్రంతో పాటకే ప్రాణం పోసిన ఓ లెజెండ్. గంటలసాకు ముందు..తర్వాత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ లెజెండరీ కుటుంబం నుంచి అటుపై ఇండస్ట్రీలో ఎవరూ కొనసాగలేదు. గంటసాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని గాయకులుగా ఎదిగింది లేదు.
తాజాగా గంటసాల గురించి ఆయన చిన్న కుమార్తె సుగుణ కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకు న్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే. `మా ఇల్లు ఎప్పుడూ సినిమా వాళ్లతో సందడిగా ఉండేది.
పాటలకు సంబంధించిన రిహార్సల్స్ అన్ని మా ఇంట్లోనే జరుగుతుండేవి. రామారావుగారి ఫ్యామిలీకి – మా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూ వేసేవారు. నాన్న గారితో చూసే వాళ్లం. నాన్నగారికి కోపం రావడం మేము చూడలేదు. ఆయన గట్టిగా మాట్లాడటం కూడా మాకు తెలియదు. ఏమాత్రం సమయం చేతిలో ఉన్నా అందర్నీ తీసుకుని తిరుపతి వెళ్లేవారు.
స్వామివారికి ఎదురుగా ఉన్న వాకిలిలో కూర్చొని పాడేవారు. అదెంత గొప్ప విషయం అన్నది అప్పుడు మాకు తెలియలేదు. నాన్న గారికి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది. ఒక నాటు వైద్యుడు ఇచ్చిన మందు వాడటం వలన గొంతు కొట్టుకుపోయి చాలా బాధపడ్డారు. రవీంద్ర భారతిలో ఏదో కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది.
గొంతు కొట్టుకుపోయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రెండోసారి కూడా వచ్చింది. గొంతు బాధ నుంచి కోలుకున్నారు. తర్వాతి రోజు డిశ్చార్చ్ చేస్తామన్నారు. ఇంటికి వచ్చాక అంతా కలిసి బీచ్ కి వెళ్దాం అన్నారు. కాసేపట్లో డిశ్చార్చ్ అనగా మళ్లీ హార్ట్ అటాక్ వచ్చింది. ఆరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను` అని ఎమోషనల్ అయ్యారు.
Recent Random Post: