విశ్వక్ సేన్ కు తారక్ ఝలక్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలు మిగతా హీరోలతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక మరికొందరు ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. విశ్వక్ సినిమా ఏది రిలీజ్ అయిన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి.

గతంలోనే చాలాసార్లు ఎన్టీఆర్ కు తాను వీర అభిమానిని అంటూ విశ్వక్ సేన్ తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విశ్వక్ గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు మంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మంచు మనోజ్ ఉస్తాద్ షోలో పాల్గొన్న విశ్వక్ ఎవరికి తెలియని ఒక విషయాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా అతనితో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న బాండింగ్ గురించి కూడా అర్థమయ్యేలా చెప్పడం విశేషం.

సినిమా ఇండస్ట్రీలో ఏ సెలబ్రెటీ తో పార్టీని బాగా ఎంజాయ్ చేశారని మనోజా అడిగాడు. ఇక విశ్వక్ సమాధానం ఇస్తూ.. ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ అన్నతో ఫార్మ్ హౌస్ పార్టీలో పాల్గొన్నాను. అయితే మరుసటి రోజు ఉదయమే నాకు షూటింగ్ ఉంది అని బయలుదేరడానికి లేచాను. కానీ ఎన్టీఆర్ మాత్రం కాస్త గర్జిస్తూ.. బైటో.. అసలు నాట్ అలౌడ్ అంటూ కూర్చోబెట్టారు. అది నాకు చాలా మెమొరబుల్ పార్టీ అని విశ్వక్ సేన్ తెలియజేశాడు.

ఈ యువ హీరో ఆ విషయాన్ని ఎంతో సరదాగా నవ్వుతూ చెప్పడంతో వారి మధ్యలో ఉన్న అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పవచ్చు. అలాగే విశ్వక్ కు గతంలో బాలకృష్ణ సినిమాలో (NBK 109) ఒక కీలకమైన రోల్ చేసే అవకాశం వచ్చినా చేయలేదు. ఎందుకంటే తనకు బాలయ్య గారు అంటే చాలా ఇష్టం అని మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తే ఇంకాస్త ఎక్కువ టైమింగ్ ఉన్న రోల్ చేయాలని ఉన్నట్లుగా విశ్వక్ తెలిపాడు.

ఇక విశ్వక్ ఇటీవల వచ్చిన గామి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాకు మొదటి రోజే సాలిడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వీకెండ్ లోనే దాదాపు పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చిన గామి వీకెండ్ తర్వాత మరింత లాభాలను అందిస్తోంది. ఇక లైనప్ లో ఈ టాలెంటెడ్ హీరోకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ అతను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా కూడా సాంగ్స్ తో టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది.


Recent Random Post: