సాయి పల్లవి డ్రీమ్ ఏంటో తెలుసా…!

లేడీ పవర్‌ స్టార్‌ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగు లో ఈ అమ్మడి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి తిరిగి కెమెరా ముందుకు వచ్చింది. తెలుగు లో తండేల్ సినిమా తో ఈ అమ్మడు త్వరలో రాబోతుంది.

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్‌ లో సాయి పల్లవి కనిపించబోతుంది. సినిమా ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అందులో సాయి పల్లవి లుక్‌ ఆకట్టుకుంది. ఈ అమ్మడు మరోసారి ఫిదా చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

తాజాగా సాయి పల్లవి ఒక చిట్ చాట్‌ లో తన డ్రీమ్‌ ను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తున్న తాను భవిష్యత్తు లో దర్శకత్వం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రస్తుతం తన అభిరుచికి తగ్గ కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్లు సాయి పల్లవి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

హీరోయిన్ గా ప్రస్తుతం టాప్ స్టార్‌ గా దూసుకు పోతున్న సాయి పల్లవికి దర్శకత్వం పై ఆలోచన కలగడం విడ్డూరంగా ఉంది. ఆమె సౌత్‌ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఉంది. అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు దర్శకత్వం పై ఆసక్తి చూపించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.

సాయి పల్లవి దర్శకత్వం చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కనుక ఆమె దర్శకత్వంలో సినిమాకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌ గా క్రేజ్ తగ్గిన తర్వాత దర్శకత్వం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆలోచన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.


Recent Random Post: