ఆయ‌న 360 డిగ్రీల‌కంటే ఒక డిగ్రీ ఎక్కువే!

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌న గురించి చెప్పేదేముంది? న‌ట‌న‌లో ఆయ‌న కొట్టే న‌టుడు మ‌రొక‌రున్నారా? అంటే అందుకు ఛాన్సే లేదంట‌రంతా. అలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కాబ‌ట్టే లోకనాయ‌కుడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నారు. వెండి తెర‌పై ఆయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు మ‌రో న‌టుడు చేయలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. ఆయ‌న మ్యాక‌ప్ వేసుకుంటే? ఆ పాత్ర‌కే వ‌న్నె తెచ్చేస్తారు. అందుకే ఎన్ని అవ‌తార‌లైనా ఎత్త‌గ‌ల గొప్ప న‌టుడిగా సినీ జ‌గ‌త్తులో నీరాజ‌నాలు అందుకుంటున్నారు. PlayUnmute /

తాజాగా క‌మ‌ల్ న‌ట‌న గురించి స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `భార‌తీయుడు-2` త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా క‌మ‌ల్ న‌ట‌న గురించి శంక‌ర త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే…` భార‌తీయుడు తాత మంచి వాళ్ల‌కు మంచి వాడు. చెడ్డ‌వాళ్ల‌కు చెడ్డవాడు. క‌మ‌ల్ హాస‌న్ 360 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీ న‌టించే స‌త్తా ఉన్న న‌టుడు. 7 రోజుల పాటు మ్యాక‌ప్ తోనే న‌టించారు.

ఆయ‌నలాంటి న‌టుడు ప్ర‌పంచంలోనే లేరు. నాతో భార‌తీయుడు, ఆసినిమాకి కొన‌సాగింపుగా మ‌రో సినిమాలు చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ రెండు భార‌తీయుడు కంటే పెద్ద విజయం సాధిస్తాయి. సాధార‌ణంగా ఏ సినిమా గురించి ఇంత‌లా మాట్లాడ‌ను. కానీ సినిమా గురించి మాట్లాడాలి అనిపించి మాట్లాడుతున్నాను` అని అన్నారు. శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. క‌మ‌ల్ ని ఏకంగా ప్ర‌పంచంలోనే గొప్ప న‌టుడిగా కీర్తించారు.

శంక‌ర్ లాంటి గ్రేటే క్రియేట‌ర్ క‌మ్ మేక‌ర్ అలాంటి కితాబు ఇవ్వ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఈసినిమాపై భారీ అంచ‌నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార చిత్రాలు పెద్ద‌గా ఊపు తీసుకురాన‌ప్ప‌టికీ అవినీతీ, లంచ‌గొండి త‌నం కాన్సెప్ట్ కాబ‌ట్టి శంక‌ర్ చెల‌రేగిపోతార‌నే అంచ‌నాలైతే అంద‌రిలోనూ ఉన్నాయి. మ‌రోసారి స‌మాజానికి శంక‌ర్ మార్క్ తుటాలు లాంటి ప్ర‌శ్న‌లు ఈ సినిమా ద్వారా వెళ్ల‌బోతున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.


Recent Random Post: