టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ.. గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. బాలయ్య చెల్లెలి పాత్రలో నటించింది. అన్నయ్యపై ప్రేమను, పగను చూపిస్తూ రెండు షేడ్స్ ఉన్న రోల్ లో ఆడియన్స్ ను రేంజ్ లో థ్రిల్ చేసింది వరలక్ష్మి.
చెప్పాలంటే ఆమె పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. అసలు స్టోరీ కూడా వరలక్ష్మి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలా మూవీలో బాలయ్య చెల్లెలుగా అదరగొట్టిన ఆమె.. తాజాగా నటసింహాన్ని కలిసింది. బాలకృష్ణ ఇంటికి వరలక్ష్మి మంగళవారం ఉదయం వెళ్లింది. తన పెళ్లి వేడుకకు బాలయ్య, వసుంధర దంపతులను ఆహ్వానించింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాలయ్య, వరలక్ష్మి కలిసి దిగిన ఫోటో ఫుల్ ట్రెండ్ అవుతోంది. రీల్ అన్నాచెల్లెళ్లు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చెల్లికి అన్నయ్య దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి వరలక్ష్మి.. తన వివాహ వేడుకకు టాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రెటీలను ఆహ్వానిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె పలువురికి ఇన్వైట్ చేస్తున్న ఫోటోలు.. తెగ కనిపిస్తున్నాయి.
అయితే కోలీవుడ్ ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఆ తర్వాత సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో అడుగుపెట్టింది. తెలుగులో వేరే లెవల్ క్రేజ్ సంపాదించుకుంది. మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. టాప్ హీరోల సినిమాల్లో మంచి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లవర్స్ ను బాగా అలరిస్తోంది. ఇప్పుడు తన ప్రియుడితో వివాహ బంధంలో అడుగు పెట్టబోతోంది.
ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్ దేవ్ తో వరలక్ష్మి వివాహం.. జులై 2న థాయిలాండ్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చెన్నైలోని విలాసిని సరై లీలా ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అది కూడా జులై ఫస్ట్ వీక్ లోనే అవ్వనున్నట్లు టాక్. మరి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహంతోపాటు రిసెప్షన్ కు టాలీవుడ్ నుంచి ఎవరెవరు హాజరవుతారనేది చూడాలి.
Recent Random Post: