చంద్రముఖిలో `వారాయ్ నానుడి తేడీ` పాటతో జ్యోతిక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న సంగతి తెలిసిందే. వారాయ్ అంటూ ఇండియా మొత్తాన్ని ఊపేసిన పాట అది. అందులో జ్యోతిక అంత గొప్ప పెర్పార్మెన్స్ తో పాటు గొప్ప క్లాసిక్ డాన్సుతో మెప్పిచింది కాబట్టే సాధ్యమైంది. ఆ సినిమా తర్వాత జ్యోతిక ఇలాంటి పాత్రలకు పర్పెక్ట్ ఛాయిస్ గా కనిపించింది. అయితే జ్యోతిక అంతగా ఫేమస్ అవ్వడానికి అసలు కారణం మె కాదు? ఆమె కొరియోగ్రాఫర్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వారాయ్ పాటకి లేడీ మాష్టర్ కళ కంపోజ్ చేసారు. తాజాగా ఆనాటి విమర్శల్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ` `వారాయ్ నానుడి తేడీ పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతోమంది విమర్శించారు. ఆ డాన్సు ఎక్కడ సూటవుతుందన్నారు. కానీ అదే పెద్ద హిట్ అయింది. వాస్తవానికి జ్యోతిక క్లాసికల్ డాన్సర్ కాదు. కానీ ఆ పాటకి క్లాసిక్ డాన్స్ అవసరం. అందులోనూ బాగా ప్రావీణ్యం ఉంటే తప్ప నేను కంపోజ్ చేసే స్టెప్పులు వేయడం సాధ్యం కాదు.
అయినా నమ్మకంతో జ్యోతికకు క్లాసిక్ డాన్స్ నేర్పించాను. అందుకు సమయం తీసుకున్నాను. జ్యోతిక నేర్చుకున్న తర్వాత రెండు రోజుల్లోనే ఆ పాట షూట్ పూర్తి చేసాం. పాట బాగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయాక చూసుకుని జ్యోతిక నాకు వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియని వారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? నిజానికి చంద్రముఖి మలయాళ వెర్షన్ చూడలేదు.
కానీ ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసాను. ఇప్పుడు ఆ పాటని మాత్రమే ప్రత్యేకంగా ఇష్టపడే వారెంతో మంది` అని అన్నారు. ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా డాన్సు వచ్చేది కాదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే డాన్సు నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్ని రకాలుగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సినిమాల్లోకి రావడంతో కొరియోగ్రాఫర్లకి ఇబ్బంది ఉండటం లేదు.
Recent Random Post: