యానిమ‌ల్‌ని పిచ్చిగా వ‌ర్ణించిన ఆర్జీవీ

సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన‌ ‘యానిమల్’పై చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సినిమాలో హింస‌, ర‌క్త‌పాతం, స్త్రీద్వేషం కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఎవ‌రు ఎన్ని కామెంట్లు చేసినా కానీ యానిమల్ చిత్రం 2023 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచింది. రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రం దేశీయంగా రూ. 662.33 కోట్లు .. విదేశాల నుంచి రూ. 255.49 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 917.82 కోట్ల ఆర్జ‌న‌తో సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ సినిమా గురించి ప‌లువురు హిందీ ఫిలింమేక‌ర్స్ చాలా విమ‌ర్శ‌లు చేసి చివ‌రికి నాలుక్క‌రుచుకున్నారు. అనురాగ్ బ‌సు లాంటి డైరెక్ట‌ర్ తాను అన్న మాట‌ల‌కు ఆల్మోస్ట్ సందీప్ వంగాకు సారీ చెప్పినంత ప‌ని చేసాడు. అంతేకాదు సందీప్ వంగాను క‌లిసి అభినందించకుండా ఉండ‌లేక‌పోయాడు. సందీప్ వంగా పనిత‌నాన్ని కంగ‌న లాంటి స్టార్ పొగిడేసిన తీరు కూడా ఆస‌క్తిని క‌లిగించింది.

ఇప్పుడు సందీప్ వంగాను పొగుడుతూ స్టార్ల‌ను తిట్టే ప‌నిలో ప‌డ్డాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అత‌డు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. భారీ బడ్జెట్ లేదా విస్తృతమైన స్పెషల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా బ్లాక్‌బస్టర్‌ను రూపొందించడంలో సందీప్ వంగా విజయాన్ని ప్ర‌శంసిస్తూ.. విమ‌ర్శ‌ల‌ను వ్య‌తిరేకిస్తూ సందీప్ వంగాను సమర్థించారు.

ర‌క‌రకాలైన ప్రేక్షకులు ర‌క‌రకాల చిత్రాలను ఇష్టపడతారు. ఒకే రకమైన ప్రేక్షకులకు గదర్ 2, యానిమ‌ల్ రెండూ నచ్చుతాయనేది నేను నమ్మలేకపోతున్నాను. ఇదే కాదు.. నేను ఈ రకమైన ఆహారాన్ని మాత్రమే తింటాను! అంటూ వ‌ర్మ చాలా వివ‌ర‌ణాత్మ‌కంగా పాపుల‌ర్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ర‌ణ‌బీర్ కి సమకాలీన తారలు గణనీయమైన నిర్మాణ వ్యయాలతో పెద్ద‌ ప్రాజెక్ట్‌లలో న‌టించిన‌ప్పుడు ఎదుర్కొంటున్న ఒత్తిడిని కూడా వర్మ హైలైట్ చేశాడు. ”పెద్ద తార‌లు పెద్ద సినిమాలు చేయాలి. ఎందుకంటే వారి మధ్య పోటీ ఉంటుంది. ప్రతి పెద్ద స్టార్ తన అభిమానులను, మార్కెట్‌ను విస్తరించాలని కోరుకుంటాడు. దానికోసం పెద్ద సినిమాలు తీస్తాడు. సాంకేతికంగా చాలా భారీ VFX , ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు, ఇత‌ర‌ డిజైన్ ల‌కు సంబంధించిన‌ ఖర్చులు పెట్టిన త‌ర్వాతే సినిమా విడుద‌ల‌వుతుంది.. ఇది ఒత్తిడిని పెంచుతుంద‌ని ఆర్జీవీ వివరించాడు.

యానిమ‌ల్ నిజానికి మామూలు బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం. యానిమ‌ల్ కోసం సాంప్రదాయ విధానాన్ని ధిక్కరించినందుకు సందీప్ రెడ్డి వంగాను ప్రశంసించారు. సందీప్ రెడ్డి వంగా ఇత‌ర పెద్ద స్టార్ల‌ ఆలోచ‌న‌లను తప్పు అని నిరూపించాడు. ఎందుకంటే యానిమల్ అతి తక్కువ ఖర్చుతో తీసిన చిత్రం. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర లేదా శంషేరాతో పోలిస్తే నిర్మాణం పరంగా ‘యానిమల్’ అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ చిత్రం. ర‌ణ‌బీర్ పెద్ద స్టార్. అత‌డి సినిమాల్లో పెద్ద నిర్మాణ విలువలు అని చెప్పుకునే చాలా సినిమాల‌ కంటే యానిమ‌ల్ మెరుగ్గా ఆడింది అని అభిప్రాయ‌ప‌డ్డారు ఆర్జీవీ. ‘యానిమ‌ల్’ విజయం ఇతర దర్శ‌క‌నిర్మాతలు ఇదే మార్గాన్ని అనుసరించడానికి ప్రోత్సహిస్తుందా? అని ప్ర‌శ్నించ‌గా వర్మ సందేహించారు. వేగంగా త‌క్కువ ఖ‌ర్చు తో తీసిన యానిమ‌ల్ పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌ను ఎప్పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని వ‌ర్మ అన్నారు. నిర్మాతలు యానిమల్‌ లాంటి సినిమా తీసి వెనక్కి ఆలోచించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అమీర్ ఖాన్ 25 సంవత్సరాల క్రితం చిన్న, పెద్ద సినిమాలు చేయడం ద్వారా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ఒక పాత ప‌ద్ధ‌తిని ఛేదించారు. ఇప్పుడు ఒక్క హీరో కూడా అలా చేయడం నాకు కనిపించడం లేదు! అని అన్నారు.

ఆర్జీవీ నేటి ప్ర‌జ‌ల ట్రెండీ ఆలోచ‌న‌ల గురించి ప్ర‌స్థావించారు. భారతీయులు మునుపటి భారతీయులు వలె అదే భారతీయులు కాదు… పాత త‌రం కాదు. సినిమాలు ఒక కళారూపమని.. సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని విశ్వసిస్తే.. యానిమ‌ల్ ఈ స‌మాజం సంస్కృతిని పునర్నిర్వచించిందని. అంతకుముందు కళగా పిలువబడిన దానిని నాశనం చేసింద‌ని భావించాలి.

కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల వ‌సూళ్ల‌ను అధిగమించిన ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంపై వర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసారు. మనందరిలో యానిమ‌ల్స్ దాగి ఉన్నాయి! అనేదానికి ఈ సినిమా విజయం నిదర్శనమని ఆర్జీవీ అన్నారు. ఎవ‌రితోను ప్రేమించబడని గౌరవనీయమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై విస్తృతమైన అభిమానాన్ని ఈ విజ‌యం ప్రతిబింబించింది! అని అన్నారు.

మనందరిలో ఎలాంటి యానిమ‌ల్స్ దాగి ఉన్నాయో …! ఇప్పుడు ప్రతి భారతీయుడు మ‌రొక‌ భారతీయుడికి పరిచయం అవుతున్నారు. ఇప్పుడు భారతీయులంద‌రూ ప్రేమించని.. గౌరవించబడే దర్శకుడిని (సందీప్ రెడ్డి వంగా) ప్రేమిస్తారు.. గౌరవిస్తారు అని బాక్సాఫీస్ రుజువు చేసింది. భారతీయులంతా పెద్దవాళ్లు(చేతులు ముడుచుకున్న ఎమోజీలు) అయ్యార‌ని అంద‌రూ గ్రహించారు.. అంటూ వ‌ర్మ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు.


Recent Random Post: