బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎటాకింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. విమర్శ అయినా ప్రశంస అయినా ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే స్వభావం గల నటి. ఆ రకంగా బాలీవుడ్ లో చాలా మందికి శత్రువుగానూ మారింది. ఇప్పటికే బాలీవుడ్ పై ఎన్నో ఆరోపణలు చేసింది. స్టార్ హీరోల్ని సైతం విడిచి పెట్టలేదు. అందర్నీ చెడుగుడు ఆడుకుంది. తాజాగా మరోసారి పరిశ్రమ పై సంచలన ఆరోపణలు చేసింది.
`ఇండస్ట్రీలో ప్రోత్సహించే వారికన్నా కిందకు ఎలా తొక్కాలని ఆలోచించే వారే ఎక్కువగా ఉంటారంది. ` నేను మంచి వ్యక్తిని.అందరితో మంచిగా నడుచుకుంటా. ఇటీవలే ఎన్నికల్లో గెలిచా. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానం పొందా. కానీ నాతో కొంత మందికి సమస్య ఉంది. ఆ సమస్య నాలో ఉందా? వారిలో ఉందా? అనేవారు కూడా ఒక్కసారి ఆలోచించాలి. బాలీవుడ్ నిస్సహాయ స్థితిలో ఉంది.
పరిశ్రమకు చెందిన కొంత మంది వ్యక్తులు ఎలాంటి సహాయం చేయరు. ఎదిగేవారిని, ట్యాలెంట్ ని చూసి అసూయ పడతారు. వాళ్లకు అదే పని. ట్యాలెంట్ ఉన్న వారు ఎవరైనా వాళ్ల దృష్టిలో పడితే వాళ్ల కెరీర్ నే నాశనం చేస్తారు. పీఆర్ లను నియమించి తప్పుడుగా ప్రచారం చేయిస్తారు. ఇండస్ట్రీ వారిని బహిష్క రించే పరిస్థితులు సృష్టిస్తారు. పరిశ్రమకి కొత్తగా వచ్చిన వారికి ఈ విషయాలేవి తెలియవు. దీంతో వారి ఊబిలో చిక్కుకుంటారు.
ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి? అన్న సంగతి కొంత అనుభవం తర్వాత అర్దమవుతుంది` అని అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. కంగన నటించిన `ఎమర్జన్సీ` రిలీజ్ సందర్భంగా పలు మీడియా హౌస్ ల్ని కంగన చుట్టేస్తోంది. ఈనేపథ్యంలోనే కంగన మార్క్ ఆరోపణలతో హైలైట్ అవుతుంది.
Recent Random Post: