దుల్కర్ సెంచరీ.. ఈసారైనా దక్కేనా?

మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న దుల్కర్ సల్మాన్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రం అంటే ‘సీతారామం’ అని చెప్పాలి. ఇది స్ట్రైట్ తెలుగు మూవీగా తెరకెక్కింది. ఇతర భాషలలో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 98.1 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. 100 కోట్ల క్లబ్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఒకేసారి అన్ని భాషలలో సీతారామం రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేది. హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఈ సినిమా తర్వాత దుల్కర్ మలయాళంలో తన సొంతం ప్రొడక్షన్ లో ఒక సినిమా చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. మరల తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన ‘లక్కీ భాస్కర్’ మూవీతో దుల్కర్ మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు 74 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. నిజానికి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకాదరణ కూడా అద్భుతంగా ఉంది.

అయితే ఈ చిత్రానికి పోటీగా రిలీజ్ అయిన శివ కార్తికేయన్ ‘అమరన్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాలకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ పరంగా మూడింటి మధ్యలో గట్టి పోటీ నడుస్తోంది. అందుకే లక్కీ భాస్కర్ ఇంకా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ రెండు లేకపోయి ఉంటే దుల్కర్ ఈజీగా సెంచరీ కొట్టే అవకాశం ఉండేది. ఇక నవంబర్ 14న ‘కంగువా’ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూడు సినిమాల కలెక్షన్స్ కి బ్రేక్ పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ఈ లోపు 100 కోట్ల కలెక్షన్స్ ని ‘లక్కీ భాస్కర్’ అందుకుంటుందా అంటే డౌట్ అనే మాట వినిపిస్తోంది. అయితే దుల్కర్ కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దుల్కర్ తెలుగులో మరో రెండు సినిమాలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో రానాతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి రానా, దుల్కర్ నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు.

అలాగే పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ‘ఆకాశంలో ఒక తార’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటున్నారు. తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడం ద్వారా దుల్కర్ తన మార్కెట్ ని కూడా పెంచుకున్నాడు. అతని స్టోరీ సెలక్షన్స్ పైన ఆడియన్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ పాజిటివ్ ఇమేజ్ నెక్స్ట్ అతని నుంచి రాబోయే సినిమాలకి బిజినెస్ పరంగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.


Recent Random Post: