చ‌ర‌ణ్ అన్న‌య్య భుజం మీద చేయ్యేస్తేనే 100కోట్లు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `మ‌ట్కా` రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈనెల 14న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. డిఫరెంట్ టైటిల్ సహా లీకైన కంటెంట్.. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో ఆద్యంతం ఆస‌క్తి పెరుగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌రుణ్ తేజ్ కి స‌రైన స‌క్సెస్ ల్లేవ్. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

హిట్ కొడతాడు అనే కాన్పిడెన్స్ అత‌డు స‌హా మెగా అభిమానుల్లో ఎంతో బ‌లంగా ఉంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా వ‌రుణ్ కొన్ని ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నాడు. ఆవేంటో ఆయ‌న మాట్లోనే…` సినిమాలు స‌రిగ్గా ఆడ న‌ప్పుడు బాధేస్తుంది. మూడు రోజుల కింద‌ట ఈ సినిమా గురించి ఆలోచిస్తూ లావ‌ణ్య‌తో మాట్లాడి పడుకున్నా. ఉద‌య‌మే మా అన్న‌య్య రామ్ చ‌ర‌ణ్ ఫోన్ చేసాడు. ఆయ‌న నోరు తెరిచి ప‌ది మాట‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ప‌క్క‌న కూర్చుని భుజం మీద చేయి వేస్తే చాలు. అదే నాకు 100 కోట్లు. భావోద్వేగంగా నాకెప్పుడు అండ‌గా ఉన్నాడు. కుటుంబం గురించి మాట్లాడుతాడు? ఏంటి అనుకోవ‌చ్చు. జీవితంలో మ‌నం ఎక్క‌డ నుంచి వ‌చ్చాం? మ‌న వెనుకాల ఎవ‌రు ఉన్నారు? అన్న‌ది మ‌ర్చిపోతే ఆ విజ‌యం దేనికి ప‌నికి రాదు. మా పెద‌నాన్న‌, బాబాయ్, మా నాన్న నా వెన‌కాల ఉన్నారు. నేను ఎక్క‌డ ఉన్నా త‌న‌కంటే ఎక్కువ‌గా న‌న్ను చూసుకుంటూ స‌హ‌కారం అందిస్తోంది నా భార్య లావ‌ణ్య‌.

ప‌దేళ్ల కాలంగా నా చిత్ర బృందం నాతోనే ఉంది. ఎంతో మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఇలా అంతా నాతో ఎప్పుడూ ఉండ‌నే ఉన్నారు. ఇలాంటి స‌పోర్ట్ ఉండ‌టం వ‌ల్లే ఇవ‌న్నీ నాకు సాధ్య‌మ‌వుతున్నాయి. గ‌త రెండు సినిమాల విష‌యంలో నా టార్గెట్ మిస్ అయినా ఈసారి మాత్రం మిస్ అవ్వ‌దు` అని అన్నాడు.


Recent Random Post: