టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ, రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ‘బావా బావా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి మీద ఒకరికి ఉన్న అనుబంధాన్ని స్నేహ బంధాన్ని చాటుకున్నారు. మనం గమనిస్తే, వీరిద్దరి సినీ ప్రయాణంలో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి.
లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా మెగా ఫ్యామిలీ సపోర్టుతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అయితే తారక్, బన్నీ ఇద్దరూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. తమ కష్టంతోనే స్టార్ హీరోల స్థాయికి వచ్చారు. టాలీవుడ్ స్టార్స్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు సొంతంగా తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే సినిమా సినిమాకీ తమ రేంజ్ పెంచుకుంటూ పోతున్న వీరిద్దరిపై సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే నెగెటివిటీ కనిపిస్తుంది. వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. వాంటెడ్ గా సినిమాల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఒక్కోసారి వీరి చిత్రాలను బాయ్ కాట్ చేయాలని, ఎవరూ ఆ సినిమాలను చూడొద్దు అంటూ నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో నెట్టింట ట్రెండ్ కూడా చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తారక్, బన్నీ ఇద్దరూ ఒక విధమైన ప్రాబ్లమ్ ను ఎదుర్కొంటున్నారు.
పెద్ద సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చి, ఇతరత్రా కారణాలతో తమ ఫ్యామిలీ హీరోల పేర్లను ప్రస్తావించకపోవడం వల్లనే సోషల్ మీడియాలో తారక్, అల్లు అర్జున్ లపై నెగటివిటీ పెరిగిపోతున్నట్లు కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ ల మధ్య దూరం పెరిగినట్లు ఎప్పటి నుండో రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ గత కొన్నాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా లేవు. సినిమా ఫంక్షన్లలో తన తాతను తలచుకునే తారక్.. బాలయ్య పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. దీంతో ఓ వర్గం కావాలని ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు మెగా, అల్లు కుటుంబాల మధ్య అంతా సవ్యంగా లేదనే పుకార్లు కూడా చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గతంలో ఓ ఈవెంట్ లో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ పేరును చెప్పకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో మనం చూశాం. అప్పటి నుండి ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ ను కలిసి వచ్చిన తర్వాత, మెగా ఫ్యామిలీ సభ్యులు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ఎంతటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది సినిమాలను బహిష్కరించాలని పోస్టులు పెట్టే వరకూ వచ్చింది.
అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి నెగటివిటీని పట్టించుకోకుండా, ముందుకు సాగిపోతున్నారు. తమ విజయాలతోనే అందరికీ గట్టిగా సమాధానం చెబుతున్నారు. RRR సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన తారక్.. ఇటీవలే ‘దేవర 1’ మూవీతో తన స్టార్ పవర్ ఏంటో చూపించారు. ‘పుష్ప 1’ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన బన్నీ.. ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Recent Random Post: