అక్కినేని నాగచైతన్య- శోభిత జంట వివాహం ఇటీవల రెగ్యులర్ గా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచిన టాపిక్. ఇంతలోనే అక్కినేని అఖిల్- జైనాబ్ రావ్ జీ జంట పెళ్లి గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ జంట నిశ్చితార్థం ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే వివాహ తేదీ గురించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఇంతకుముందు అఖిల్ నిశ్చితార్థం నుంచి అద్భుతమైన ఫోటోలను షేర్ చేశారు నాగార్జున. అవన్నీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో కొత్త ఫోటోగ్రాఫ్ వెబ్ లో వైరల్ గా మారుతోంది. జైనాబ్ తన కాబోయే భర్త అఖిల్ అక్కినేనితో!… ఈ ఫోటోకి క్యాప్షన్ ఇది. అఖిల్- రావ్ జీ జంట ఈ ఫోటోగ్రాఫ్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. దీనికి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. “జంట బావుంది.. పెళ్లి తేదీ ఖరారైందా?“ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి అఖిల్ పెళ్లి కూడా నాగచైతన్య పెళ్లితో పాటు ఒకే వేదిక పై జరుగుతుందని ప్రచారమైంది. కానీ అది నిజం కాదని ప్రూవ్ అయింది. సో – చై పెళ్లి ఈనెల 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అక్కినేని అఖిల్ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడా? లేక ఇంకేదైనానా? అన్నదానికి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నాగార్జున నుంచి తదుపరి పెద్ద ప్రకటన వస్తుందని అభిమానులు వేచి చూస్తున్నారు.
Recent Random Post: