అడవి శేషు నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. చివరిగా 2022 లో `హిట్ ది సెకెండ్ కేస్` తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించాడు. ఆ తర్వాత శేషు నటిస్తున్న సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అనే మాట తప్ప వాటి అప్ డేట్స్ మాత్రం పెద్దగా రావడం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా `గుఢచారి`కి సీక్వెల్ గా `గుఢచారి-2` సెట్స్ లో ఉంది. దాంతో పాటు `డెకాయిట్ ఏ లవ్ స్టోరీ` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాలు ప్రారంభో త్సవం..రెగ్యులర్ షూటింగ్ మొదలై చాలా కాలమవుతుంది.
కానీ అప్ డేట్స్ మాత్రం సవ్యంగా రావడం లేదు. `డెకాయిట్` సినిమాకు శేష్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అంటే ఆ పెరుమాళ్లకే తెలుసు అన్నట్లుగానే సన్నివేశం కనిపిస్తుంది. సినిమాలు సెట్స్ లో ఉన్నాయి అనే మాట గానీ అవి ఎంత వరకూ షూటింగ్ పూర్తయ్యాయి? ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి? అనే అప్ డేట్ ఏదీ లేదు. తాజాగా ఏడాది ముగింపు నేపథ్యంలో శేష్ ట్విటర్లోకి వచ్చి ఇలా సర్ ప్రైజ్ చేసాడు.
డిసెంబర్ లో `డెకాయిట్` సర్ ప్రైజ్..జనవరిలో `గుఢచారి2` సర్ ప్రైజ్ అంటూ కవ్వింపు చర్యకు దిగాడు. సినిమా లు సెట్స్ లో ఉన్న అప్ డేట్ లేకపోవడంతో జనాలు కూడా ఈ రెండు సినిమాల గురించి మర్చిపోయారు. ఇప్పటికే కొన్ని రకాల ప్రచార చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ కంటున్యూటీ అప్ డేట్ లేకపోవడంతో ఈ రకమైన పరిస్థితి వచ్చింది.
మరి తాజాగా ఇచ్చిన రెండు అప్ డేట్లు ఏంటి? అంటే అతిగా ఆశలు పెట్టు కోవడానికి కనిపిచండం లేదు. టీజర్, ,ట్రైలర్ లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా. మరి ఈ రెండు గాక ఇంకేదైనా సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది తెలియాలి.
Recent Random Post: