3 ఏళ్లకు తబలా, 7 ఏళ్లకు ఫస్ట్‌ ప్రదర్శన

పద్మవిభూషన్‌ గ్రహీత, ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌ తీవ్ర అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతున్న జాకీర్ హుస్సేన్‌ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఈయనకి భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2023లో పద్మవిభూషణ్‌ అందజేసింది. 1990లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్‌ మొదటి ప్రదర్శన తన 7వ ఏట ఇచ్చారు.

జాకీర్‌ హుస్సేన్‌ జీవితంలో ముఖ్య ఘట్టాలు…
మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి ప్రోత్సాహం తో తబలా వాయించడం మొదలు పెట్టారు.
జాకీర్‌ హుసేన్ తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఏడు సంవత్సరాల వయసులో స్టేజ్‌పై మొదటి తబలా ప్రదర్శన ఇచ్చారు.
12 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై జాకీర్‌ హుస్సేన్‌ తన మొదటి ప్రదర్శన ఇచ్చారు.
ఈ ఏడాది జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకేసారి మూడు అవార్డులు అందుకున్న ఏకైక ఇండియన్‌ కళాకారుడిగా జాకీర్‌ హుస్సేన్‌ నిలిచారు.

2009లో మిక్కీ హార్డ్‌తో కలిసి ప్లానెట్‌ డ్రమ్‌ ఆల్బమ్‌కి గాను గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.
హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌, జాజ్ ఫ్యూజన్‌లో తన సత్తా చాటారు.
చిన్నతనంలోనే సంగీత ప్రపంచంలో అడుగు పెట్టిన జాకీర్‌ హుస్సేన్‌ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు.
1969 లో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ అందుకున్నారు.
మొదటి ఆల్బం 1991 లో విడుదలైంది.
1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డు అందుకుంది. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు.
జాకీర్ హుసేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు.
జాకీర్‌ హుస్సేన్‌కి ఇద్దరు అమ్మాయిలు.
అనిసా కురేషీ, ఇసబెల్లా కురేషీ.
డిసెంబర్ 15న ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.
అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆయన మరణాన్ని ధ్రువీకరించారు.


Recent Random Post: