సంక్రాంతికి వస్తున్నాం.. అసలైన ఫెస్టివల్ వైబ్

ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇక పండుగకు ముందే అభిమానుల హృదయాలను సంతోషభరితంగా చేస్తూ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి. వెంకీ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం అసలైన ఫెస్టివల్ వైబ్ క్రియేట్ ఇవ్వబోతోంది. ఈ సినిమా 2025 జనవరి 14న పండుగ రోజున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి. పక్కా ప్లాన్ తోనే సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. ఈ సినిమాలో “మీను” పాట ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటలో సాంప్రదాయ సందేశాలతో పాటు ఆసక్తికరమైన డ్యాన్స్ మూమెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. సంక్రాంతి స్పెషల్ సాంగ్ త్వరలో విడుదలవుతుందని ప్రకటించడంతో, పండుగ సీజన్ మొదటి సంబరాలకు శ్రీకారం చుట్టినట్లైంది. ముఖ్యంగా వెంకీ ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీ హైలెట్ కాబోతున్నట్లు అర్ధమవుతుంది.

సంక్రాంతి సందర్భంగా ప్రమోషన్లకు చాలా గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. టీవీ, టాక్ షో లలో టీం పాల్గొనడం, ప్రత్యేక ఇంటర్వ్యూలతో ప్రేక్షకులను చేరుకోవడం జరుగుతోంది. ఈ సినిమా టీం అందరికీ ఇదొక పండగ అనుభూతి కలిగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచనుంది. సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ట్రైలర్ తో ఆ అంచనాల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకటేష్ కు ఎలాంటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అనిల్ రావిపూడి అలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ కథలను తనదైన శైలిలో ప్రజెంట్ చేయగలడు. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని హడావుడి చూస్తేనే ఒక క్లారిటీ వచ్చేస్తోంది. ఇక సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

సినిమా టీం సంక్రాంతి వేడుకలను ప్రేక్షకులతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికి ఈ వేడుకకు సిద్ధమవుతోంది. ఈ వేడుకలు ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు. ఇక నుంచి మొత్తం ఆడిరిపోద్ది అంటూ మేకర్స్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో “సంక్రాంతికి వస్తున్నాం” సహా పలు పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద చిత్రాల పోటీలో కూడా ఈ సినిమా తనదైన స్థానాన్ని సంపాదించేందుకు రెడీగా ఉంది.


Recent Random Post: