సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల మధ్య అప్పట్లో ఉన్న పోటీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానుల్లో రసవత్తరమైన చర్చలు, అప్పుడప్పుడు వైరాలుగా కూడా మారేవి. నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావు వారసత్వంతో, బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వంతో, వెంకటేష్ తన తండ్రి రామానాయుడు సపోర్ట్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
మరోవైపు, చిరంజీవి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నటుడు. ఈ నేపథ్యం కారణంగా, చిరంజీవి ఒక్కతే ఒక వైపు ఉంటే, మిగతా ముగ్గురు ఒక గ్రూప్‌గా ఉంటారని అనుకునే వారు కూడా ఉన్నారు.
అయితే, ఈ నలుగురు హీరోల వ్యక్తిత్వాలు, సెట్స్‌లో వారి ప్రవర్తన గురించి సీనియర్ నటి మీనా చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ చాల Quietగా, అవసరమైతే మాత్రమే మాట్లాడుతారని ఆమె తెలిపారు. అనవసరంగా సంభాషణలు లేకుండా వారు తమ పనిపైనే దృష్టి పెడతారు.
ఇదే సమయంలో, బాలకృష్ణ పాత్ర పూర్తి భిన్నమైనది. సెట్స్‌పై సకల నటీనటులతో సరదాగా మాట్లాడటం, అందరినీ మాట్లాడించటం, జోకులు చెప్పడం అతనికి సహజంగా వస్తుందట. మిగతా ముగ్గురు కూడా పరిచయం బాగా ఉన్నప్పుడు సరదాగా ఉంటారని, కానీ బాలయ్యతో పోలిస్తే తక్కువేనని మీనా పేర్కొన్నారు.
ఈరోజుల్లో చిరంజీవి, వెంకటేష్ కూడా ఆఫ్-స్క్రీన్‌లో చాలా యాక్టివ్‌గా, అందరితో సరదాగా ఉండటం చూస్తే, ఈ నలుగురు హీరోల మధ్య ఉన్న డైనమిక్స్ ఎంత అనుభవజ్ఞతతో భిన్నంగా ఉన్నాయో అర్థమవుతోంది. కానీ బాలయ్య ఎప్పుడూ ఆ ఎనర్జీని అలాగే ఉంచి, తన ప్రత్యేక శైలితో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Recent Random Post: