జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసే ప్రతి కార్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చినప్పుడు ఆయన రాజకీయం ఎంతో వేరియిట్గా కనిపిస్తుంది. పవన్ ప్రజల పట్ల మాట్లాడే తీరు, ప్రజా సమస్యలపై స్పందించే తీరు కూడా మిగతా నాయకుల కంటే తేడాగా ఉంటుంది. ఈ తేడా సంక్రాంతి తరువాత మరింత స్పష్టంగా కనిపించనుంది. ప్రస్తుతం సంక్రాంతి సందడికి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం వెళ్లిన పవన్, అక్కడి ప్రజలతో పండుగను జరుపుకుంటున్నారు.
సంక్రాంతి ముగియగానే, పవన్ తన పల్లె పర్యటన ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం అవుతుంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, అవి పర్యటనకు తీసుకుంటారు. పవన్ పర్యటనను సాధారణంగా ఊర్లో అడుగు పెట్టి, అక్కడి ప్రజలతో మాట్లాడి తిరిగి వెళ్లిపోవడం కాదు. ఆయన ఆ గ్రామాల్లోనే నివసిస్తూ, అక్కడి ప్రజలతో సమానంగా జీవించి వారి సమస్యలను అర్థం చేసుకుంటారు.
ఈ పర్యటనలు “పల్లె నిద్ర” అనే పేరుతో చెప్పవచ్చు. సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా కొన్ని పల్లెల్లో బస చేస్తారు. అలానే, పవన్ తన పర్యటనలలో ప్రతి గ్రామంలో టెంపరరీ టెంట్లు వేసి వాటిలో బస చేస్తారు. ఈ టెంట్లలోనే తన రోజువారీ కార్యాలయ పనులను నిర్వహిస్తారు. అలాగే, గ్రామ ప్రజలతో సఖ్యత ఏర్పరచి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ పర్యటనలు పవన్ రాజకీయ స్థాయిని మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recent Random Post: