పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న చిత్రం “OG”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు సినిమాలలో అత్యధిక హైప్ ని పొందింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ అభిమానులను కట్టిపడేశాయి. ఇప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్, ఈ సినిమా పై మరింత అంచనాలు పెంచే ఆప్డేట్స్ ను అందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ, “నేను మీసం తిప్పి చెప్తున్నా.. OG అన్ని సినిమాలకూ సమాధానం చెబుతుంది. ఆ సినిమా వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకు తెలుస్తుంది. మనం ఏంటనేది ఆ సినిమాతో చూపిస్తాం. ఒక గ్యాంగ్ స్టర్ సినిమా ఎలా ఉండాలో OG చూపిస్తుంది. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్ అన్నీ కలిపి OG ఒక్క సమాధానం ఇస్తుంది. మన హీరోలు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేస్తే కంటెంట్ మారుతుంది, దానికి తగ్గట్టే సౌండింగ్ కూడా మారుతుంది” అని అన్నారు.
“OG ఒక అసాధారణమైన సినిమా. తమిళ చిత్రాలు వచ్చినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, టాలీవుడ్ నుంచి అందించే సమాధానం ఈ సినిమా. OST చాలా పెద్దగా ఉంటుంది, 30-40 ట్రాక్స్ ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెస్ట్ OST సృష్టించబడుతుంది. 6-7 సాంగ్స్ ఉంటాయి. ఇప్పటికే 4 పాటలు పూర్తి చేశాం. మిగతా పాటలు సినిమా రిలీజ్ అయ్యే ముందు కూర్చోవాలని అనుకుంటున్నాం” అని థమన్ చెప్పారు.
థమన్ యొక్క ఈ మాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు త్వరగా ఈ సినిమా విడుదల కావాలని పోస్టులు పెడుతున్నారు. ఇది పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని, బాక్సాఫీస్ రికార్డ్స్‌ను తిరగరాసే అవకాశం ఉన్నదని మరికొంత మంది ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
“OG” సినిమా 1980-90 దశాబ్దంలో జరిగే గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్‌తో జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ వంటి ఇతర ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటెర్టైమెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నాడు.
Recent Random Post: