వినోదం.. సాహసం

‘క్షణం, ఘాజి, గగనం’ లాంటి కమర్షియల్‌ హిట్స్‌ అందించి, ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ‘వైల్డ్‌ డాగ్‌’ లాంటి క్రేజీ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. ఇటీవల ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు సంస్థ నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి. తాజాగా తమ సంస్థ రూపొందించనున్న తొమ్మిదో చిత్రాన్ని గురువారం ప్రారంభించారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా ‘జోహార్‌’ ఫేమ్‌ తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ క్లాప్‌ ఇచ్చారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌ సినిమా స్క్రిప్టును దర్శక–నిర్మాతలకు అందజేశారు. ‘‘వినోద ప్రధానంగా సాగే అడ్వంచరస్‌ రోడ్‌ మూవీగా రూపొందనున్న చిత్రమిది. వైవిధ్యమైన కథ, కథనాలు ఉంటాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎన్‌.ఎమ్‌. పాషా, సంగీతం: ప్రియదర్శన్‌ బాలసుబ్రమణియన్, కెమెరా: జగదీష్‌ చీకటి.


Recent Random Post: