మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆచార్య సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో ఆచార్య ఖచ్చితంగా విడుదల అవుతుందని ఎదురు చూస్తునన సమయంలో అనూహ్యంగా విడుదల తేదీ విషయంలో షాక్ ఇచ్చారు. ఫిబ్రవరి వరకు ఆచార్య లేదని తేల్చి చెప్పారు. దీపావళికి విడుదల చేయలేం.. క్రిస్మస్ కు పోటీ చాలా ఎక్కువ ఉంది… సంక్రాంతికి బడా సినిమాలు చాలా ఉన్నాయి. కనుక ఫిబ్రవరి వరకు విడుదల తేదీని వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంతో పాటు రామ్ చరణ్ మరో హీరోగా నటించడం వల్ల అంచనాలు తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు గత రెండు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. కనుక విడుదల కూడా చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఫిబ్రవరికి వాయిదా పడటం చాలా మందికి నచ్చడం లేదు.
Recent Random Post: