విష్ణు వెనుక నేను ఉన్నాను

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రసవత్తరంగా మాటల యుద్దం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ తన మద్దతును మంచు విష్ణు ప్యానల్‌ కు ప్రకటించాడు. మంచు విష్ణు ప్యానల్‌ లో పూర్తిగా సమర్థులు మంచి వారు కష్టపడే వారు ఉన్నారు. వారి వల్ల ఖచ్చితంగా మా లో మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. అందుకే నేను మంచు విష్ణు ప్యానల్‌ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. నేను అధ్యక్షుడిగా చేసిన సమయంలో చాలా మంచి పనులు చేశాను. ఆ సమయంలో నాతో ఉన్న వారు ఇప్పుడు మంచు విష్ణు ప్యానల్‌ లో ఉన్నారు అన్నాడు.

మంచు విష్ణు మంచి విజన్ ఉన్న వ్యక్తి. కనుక ఖచ్చితంగా మా కోసం ఆయన కష్టపడుతాడు. మంచు విష్ణు రంథం ఎక్కుతున్నాను. ఆయనకు మద్దతుగా నేను నిలుస్తాను. ఆయన వెనుక నేను ఉన్నాను. స్థానికుడు అనే పదం నేను వాడను.. కాని ప్రకాష్ రాజ్‌ ఒక సమయంలో మా లో ఉన్న వారు ఇక్కడి వారు ఎవరు కూడా సమర్థులు కాదు. అందుకే నేను వచ్చాను అన్నాడు. ఆయన మాటలు నాకు గట్టిగా తాకాయి. ఖచ్చితంగా ఆయన గెలిస్తే అదే మాట అంటాడు. ఇక్కడి వారికి సత్తా లేక ఆయన్ను గెలిపించారు అనే వాదన వస్తుంది. అందుకే మంచు విష్ణును గెలిపించాలని ఆయన కోరాడు.


Recent Random Post: