కమల్ హాసన్ తో సూర్య అలా..

వరుస అపజయాలతో తమిళనాడులో మార్కెట్ కోల్పోతున్న కమల్ హాసన్ ఈసారి విక్రమ్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని సిద్ధమవుతున్నాడు. ఖైదీ మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

జూన్ 3వ తేదీన తమిళంలోనే కాకుండా పాజ్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. కమల్ హాసన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరికొందరు ముఖ్యమైన నటులు కూడా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

టాలెంటెడ్ యాక్టర్స్ విజయ్ సేతుపతి మలయాళం ప్రముఖ నటుడు ఫాహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రల్లో నటించినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సూర్య కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. అయితే ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంలో దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

సూర్య పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా ఉంటుంది అని ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఇలాంటి పాత్ర చేయలేదు అని కూడా అన్నారు. కనిపించిన కొద్ది నిమిషాల్లోనే చాలా పవర్ఫుల్గా హైలెట్ అయ్యే సూర్య క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని షూటింగ్ సెట్లో సూర్య ఉన్నన్ని రోజులు చాలా ప్రత్యేకంగా ఆనిపించినట్లుగా లోకేష్ ఇచ్చాడు.

అంతే కాకుండా భవిష్యత్తులో కూడా ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఈ దర్శకుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. విక్రమ్ సినిమా తెలుగులో నితిన్ హోమ్ బ్యానర్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని కమలహాసన్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. సినిమా ట్రైలర్ కు అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Recent Random Post: