ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ లు వరుసగా పెళ్లి బాట పట్టేస్తున్నారు. క్రేజీ హీరోయిన్ ల నుంచి మినిమమ్ గ్యారెంటీ హిట్ లతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ లు కూడా పెళ్లి వార్త చెప్పేస్తున్నారు. ఇటీవల కాజల్ అగర్వాల్ ప్రణీత పెళ్లి చేసుకుని పండంట పాపలకు జన్మనిచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు కూడా. ఇక ఇదే బాటలో మరో హీరోయిన్ కూడా పెళ్లిపీటలెక్కబోతోంది. గత కొంత కాలంగా పెళ్లంటే దూరం మెయింటైన్ చేస్తూ వస్తున్న హీరోయిన్ బుధవారం సోషల్ మీడియా వేదికగా షాకిచ్చింది.
తను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. రవిబాబు తెరకెక్కించిన అవును అవును 2 సీమ టపాకాయ్ చిత్రాలతో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది పూర్ణ.
గత కొంత కాలంగా హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న పూర్ణ టీవీ షోల్లోనూ మెరుస్తోంది. 2007 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించింది.
ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా నటించిన `సీమ టపాకాయ్` మూవీతో హీరోయిన్ గా తొలి సక్సెస్ ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుతిరిగి చూడని పూర్ణ తెలుగులో వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంటూ హీరోయిన్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా తన క్రేజ్ తగ్గడంతో కీలక పాత్రలకు సైతం సై అంటూ సినిమాలు చేస్తోంది. ఇదిలా వుంటే బుధవారం సోషల్ మీడియా వేదికగా తాను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించింది.
అంతే కాకుండా తాను పెళ్లి చేసుకోబోయే వరుడిని పరిచయం చేసింది. 32 ఏళ్ల పూర్ణ తనకు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలోని నెక్ట్స్ లెవెల్ లోకి అడుగుపెడుతున్నాను. షానిద్ ఆసిఫ్ ఆలీతో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందని ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడిస్తున్నానని తెలియజేస్తూ తనకు కాబోయే వరుడితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అంతే కాకుండా ఎంగేజ్ మెంట్ రింగ్ ఎమోజీని కూడా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో పూర్ణ పెళ్లి చేసుకోబోతున్న షానిద్ ఆసిఫ్ ఆలీ ఎవరని అంతా ఆరాతీస్తున్నారు. అతను ఓ బిజినెస్ మెన్ అని జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అని తను కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలిసింది. అయితే పూర్ణ వివాహం పెద్దలు కుదిర్చిందా? లేక ప్రేమ వివాహమా అన్నది తెలియాల్సి వుంది.
Recent Random Post: