అజిత్ వాలిమై ఫస్ట్ లుక్: రచ్చ రచ్చ ఖాయంలా ఉందే!

తమిళ స్టార్ హీరో అజిత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తోందంటే ఆ సందడే వేరు. నెర్కొండ పార్వై సినిమాతో ప్రేక్షకులను అలరించిన అజిత్ ఇప్పుడు అదే దర్శకుడితో అజిత్ మరోసారి పనిచేస్తున్నాడు.

ఖాకీ వంటి ఆసక్తికరమైన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన హెచ్ వినోద్ వాలిమైను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తయింది. ఈరోజు వాలిమై ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో అజిత్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి.

అలాగే మోషన్ పోస్టర్ లో ఎక్కువగా ఆకర్షించేది యువన్ శంకర్ రాజా అందించిన టెరిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మిస్తున్నాడు. హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు.


Recent Random Post: